Sleeplessness : చక్కగా నిద్ర పట్టడం కూడా ఈ రోజుల్లో పెద్ద సమస్యగా మారింది. ఒకవేళ నిద్ర పట్టిన కూడా చాలా మందికి మధ్యలో మెలుకువ వచ్చి లేగుస్తున్నారు. నిద్ర పట్టినప్పటికి శబ్దాల కారణంగా అలాగే మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వచ్చి చాలా మందికి నిద్ర మధ్యలో మెలుకువ వస్తుంది. మరలా నిద్ర పట్టడానికి ఎంతో సమయం పడుతుంది. మరలా నిద్రించడానికి అరగంట నుండి రెండు గంటల సమయం వరకు పడుతుంది. కొందరు ఎప్పటికో తెల్లవారు జామున నిద్రిస్తున్నారు. ఈ సమస్యను మనలో చాలా మంది అనుభవిస్తున్నారని చెప్పవచ్చు. దీంతో చాలా మంది మంచి నిద్రను కోల్పోతున్నారు. కనీసం మనం రోజుకు 8 గంటల పాటు చక్కగా నిద్రపోవడం చాలా అవసరం. ఇలా మెలుకువ వచ్చిన తరువాత మరలా నిద్రరాకపోవడానికి కూడా కారణాలు ఉంటాయి.
మెలకువ వచ్చిన తరువాత మరలా మెదడుకు ఆలోచించే పని చెప్పడం వల్ల మనకు నిద్రపట్టడం లేదని నిపుణులు చెబుతున్నారు. ఒకే విషయాన్ని గురించి పదే పదే ఆలోచించడం, ఆర్థిక సమస్యలు, కుటుంబ తగాదాలు, ఉద్యోగం, వ్యాపారం గురించి ఆలోచించడం వల్ల నిద్రపట్టదని నిపుణులు చెబుతున్నారు. మెలుకువ వచ్చిన తరువాత మరలా నిద్ర రావాలంటే మన మనసు ఆలోచనల మీదకి వెళ్లకుండా చూసుకోవాలి. మెలుకువ వచ్చిన తరువాత ఆలోచనలు రాకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్పే చిట్కాలను పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. నిద్రలో మెలుకువ వచ్చిన తరువాత ఆలోచనలు వస్తూ ఉంటే వెంటనే ఆ ఆలోచనలు దారి మళ్లించడానికి ప్రయత్నించాలి. మన ధ్యాస అంతా శ్వాస మీద ఉంచాలి.
ఉచ్చాస్వ, నిచ్ఛాస్వల మీద ధ్యాసను ఉంచాలి. ఇలా చేయడం వల్ల మూడు నుండి నాలుగు నిమిషాల్లోనే మరలా నిద్ర పడుతుంది. అలాగే నిద్రలో మెలుకుల వచ్చి మరలా నిద్ర పట్టనప్పుడు మనసులో అంకెలను లెక్కించాలి. కళ్లు మూసుకుని మనసులో అంకెలను లెక్కించడం వల్ల మనసు ఇతర ఆలోచనలపైకి వెళ్లకుండా ఉంటుంది. ఇలా 20 నుండి 30 అంకెలు లెక్కపెట్టే సరికి మరలా నిద్ర పడుతుంది. అలాగే మెలుకువ వచ్చి నిద్రపట్టనప్పుడు మన మనసును మనం బొట్టు పెట్టుకునే దగ్గర ఉంచి అలాగే కళ్లు మూసుకుని ఉండాలి. ఇలా చేయడం వల్ల మనసు ఇతర ఆలోచనల మీదికి వెళ్లకుండా 3 నుండి 4 నిమిషాల్లోనే నిద్రపడుతుంది. ఈ విధంగా ఈ చిట్కాలను పాటించడం వల్ల నిద్ర మధ్యలో మెలుకువ వచ్చినప్పటికి మరలా 3 నుండి 4 నిమిషాల్లోనే నిద్రపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.