Methi Leaves In Winter : ఈ మధ్యకాలంలో వాతావరణంలో చాలా మార్పులు వచ్చాయి. క్రమంగా చలి తీవ్రత పెరుగుతుంది. చలికాలం ప్రారంభమయ్యింది. ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. చలికాలంలో చలి నుండి మనల్ని మనం రక్షించుకోవడంతో పాటు మనం తీసుకునే ఆహారాల్లో కూడా మార్పులు చేసుకోవాలి. చలికాలంలో శరీరాన్ని వేడిగా ఉంచే ఆహారాలతో పాటు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలను తీసుకోవాలి. చలికాలంలో మనం మన ఆహారంలో భాగంగా తప్పకుండా తీసుకోవాల్సిన వివిధ రకాల ఆహారాల్లో మెంతికూర కూడా ఒకటి. మెంతికూరను మనలో చాలా మంది ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటారు.
దీనితో రకరకాల వంటకాలను తయారు చేసి తీసుకుంటూ ఉంటారు. మెంతికూరను తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు శరీరంలో లోపలి నుండి వెచ్చగా ఉంటుంది. మెంతికూరను తీసుకోవడం వల్ల చలికాలంలో వచ్చే అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. అలాగే మెంతికూరను తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. చలికాలంలో మెంతికూరను తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మెంతికూరలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరాన్ని జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి ఇన్పెక్షన్ ల బారిన పడకుండా కాపాడడంలో దోహదపడతాయి. అలాగే చలికాలంలో జీవక్రియల రేటు తక్కువగా ఉంటుంది.
అదే మెంతికూరను తీసుకోవడం వల్ల జీవక్రియల రేటు మెరుగుపడుతుంది. అంతేకాకుండా మెంతికూరను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. దీనిని తరుచూ తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే మెంతికూరను తీసుకోవడం వల్ల స్త్రీలల్లో నెలసరి సమయంలో వచ్చే నొప్పి తగ్గుతుంది. మెంతికూరను తీసుకోవడం లేదా మెంతులతో టీ తయారు చేసి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే మెంతికూరను తీసుకోవడం వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు తగ్గుతాయి.
హార్మోన్ల అసమతుల్యత కారణంగా తలెత్తే ఇబ్బందులు కూడా తగ్గుతాయి. మెంతికూరను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం సులభంగా బరువు తగ్గవచ్చు. దీనిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గడంలో ఎంతగానో సహాయపడతాయి. అలాగే మెంతికూరను తీసుకోవడం వల్ల పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. లైంగిక సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. ఈ విధంగా మెంతికూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చలికాలంలో దీనిని తప్పకుండా ఆహారంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.