Anti Ageing Foods : వయసు పైబడినప్పటికి యవ్వనంగా కనిపించాలని మనలో చాలా మంది కోరుకుంటారు. ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపించాలని అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు. అనేక రకాల చిట్కాలను పాటిస్తూ ఉంటారు. యవ్వనంగా కనిపించడానికి మార్కెట్ లో లభించే అన్ని రకాల సౌందర్య సాధనాలను వాడుతూ ఉంటారు. బ్యూటీ పార్లర్ ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయితే యవ్వనంగ కనిపించాలటే ముఖ్యంగా మన ఆహారపు అలవాట్లల్లో మార్పు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. యవ్వనంగా కనిపించాలనుకునే వారు కూరగాయలను, ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా పాలకూర, బచ్చలికూర వంటి వాటిని తీసుకోవాలి. కూరగాయలను తీసుకోవడం వల్ల వృద్దాప్య ఛాయలు మన దరి చేరకుండా ఉంటాయి.
అలాగే యవ్వనంగా కనిపించాలనుకునే వారు చేపలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చేపలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కొల్లాజెన్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడంతో పాటు చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అలాగే ఆహారంలో భాగంగా గుడ్లను ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో ఉండే పోషకాలు చర్మాన్ని యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంచడంలో దోహదపడతాయి. అలాగే చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో మనకు విటమిన్ సి ఎంతగానో సహాయపడుతుంది. బెర్రీ పండ్లను తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత విటమిన్ సి లభిస్తుంది. దీంతో చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే రోజూ ఆహారంలో భాగంగా ఆమైనో యాసిడ్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.
వీటిని తీసుకోవడం వల్ల కొల్లాజెన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యి చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. ఇక యవ్వనంగా కనిపించాలనుకునే వారు పంచదారను తక్కువగా తీసుకోవాలి. పంచదారను తక్కువగా తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే సోడా, టీ,కాఫీ వంటి వాటికి దూరంగా ఉండాలి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల వృద్దాప్య ఛాయలు త్వరగా వస్తాయి. వీటితో పాటు ఆల్కాహాల్ కు కూడా దూరంగా ఉండాలి. ఆల్కహాల్ ను తీసుకోవడం వల్ల కొల్లాజెన్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వదు. అలాగే వృద్దాప్య ఛాయలు కూడా త్వరగా వస్తాయి. ఈ విధంగా మనం తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపించవచ్చని నిపుణులు చెబుతున్నారు.