Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Instant Crispy Rava Vada : ర‌వ్వ వ‌డ‌ల‌ను అప్ప‌టిక‌ప్పుడు ఇన్‌స్టంట్‌గా, క్రిస్పీగా ఇలా చేసుకోవ‌చ్చు..!

D by D
December 7, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Instant Crispy Rava Vada : మ‌నం అల్పాహారంగా తీసుకునే వాటిలో వ‌డ‌లు కూడా ఒక‌టి. వ‌డ‌లు క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. సాధార‌ణంగా ఈ వ‌డ‌ల‌ను మిన‌ప‌ప్పుతో త‌యారు చేస్తూ ఉంటాము. మిన‌ప‌ప్పుతో చేసే వ‌డ‌లు రుచిగా ఉన్న‌ప్ప‌టికి వీటిని త‌యారు చేయ‌డానికి ఎక్కువ స‌మ‌యం ప‌డుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఇలా మిన‌పప్పుతోనే కాకుండా మ‌నం ర‌వ్వ‌తో కూడా వ‌డ‌ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. అలాగే ఈ వ‌డ‌ల‌ను అర‌గంట‌లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. ర‌వ్వ‌తో చేసే ఈ వ‌డ‌లు కూడా చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. ఉద‌యం పూట స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు ఇలా ర‌వ్వ‌తో వ‌డ‌ల‌ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఇన్ స్టాంట్ గా ర‌వ్వ‌తో వ‌డ‌ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఇన్ స్టాంట్ ర‌వ్వ వ‌డ‌ల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బొంబాయి ర‌వ్వ – ఒక క‌ప్పు, అటుకులు – పావు క‌ప్పు, పెరుగు – ఒక క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌, ఉడికించిన బంగాళాదుంప – 1, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు – పావు క‌ప్పు, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 1, అల్లం త‌రుగు – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, వంట‌సోడా – పావు టీ స్పూన్, ఇంగువ – కొద్దిగా, నూనె – డీప్ ప్రైకు స‌రిప‌డా.

Instant Crispy Rava Vada recipe in telugu make in this way
Instant Crispy Rava Vada

ఇన్ స్టాంట్ ర‌వ్వ వ‌డ‌ల త‌యారీ విధానం..

ముందుగా జార్ లో ర‌వ్వ‌, అటుకులు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో పెరుగు, ఉప్పు వేసిక‌ల‌పాలి. త‌రువాత ఈ ర‌వ్వ‌ను 20 నిమిషాల పాటు నాన‌బెట్టాలి. ర‌వ్వ నానిన త‌రువాత ఇందులో బ‌గాళాదుంప‌ను మెత్త‌గా చేసి వేసుకోవాలి. త‌రువాత నూనె త‌ప్ప మిగిలిన ప‌దార్థాలన్నీ వేసి బాగా క‌లుపుకోవాలి. త‌రువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక చేతుల‌కు త‌డి చేసుకుని పిండిని తీసుకుని వ‌డ‌లాగా వత్తుకుని నూనెలో వేసుకోవాలి. చేత్తో చేయ‌డం రాని వారు ప్లాస్టిక్ క‌వ‌ర్ మీద లేదా టీ గంటెపై వ‌డ‌ల‌ను వ‌త్తుకుని నూనెలో వేసుకోవాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఇన్ స్టాంట్ ర‌వ్వ వ‌డ‌లు త‌యార‌వుతాయి. వీటిని చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఇలా త‌యారు చేసిన వ‌డ‌ల‌ను ఒక్కటి కూడా విడిచిపెట్ట‌కుండా అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Instant Crispy Rava Vada
Previous Post

Nellore Style Pappu Charu : నెల్లూరు స్టైల్‌లో ప‌ప్పు చారు ఇలా చేయండి.. గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు..!

Next Post

Kidney Stones Signs : మీ కిడ్నీల‌లో రాళ్లు ఉన్నాయో లేదో.. ఈ సింపుల్ ట్రిక్స్ ద్వారా తెలుసుకోండి..!

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.