1 KG Mysore Pak : మనకు స్వీట్ షాపుల్లో లభించే తీపి వంటకాల్లో మైసూర్ పాక్ కూడా ఒకటి. మైసూర్ పాక్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. అందరికి ఎంతో నచ్చే ఈ మైసూర్ పాక్ ను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా తేలిక. స్వీట్ షాపుల్లో లభించే విధంగా గుల్ల గుల్లగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మెత్తగా ఉండే ఈ మైసూర్ పాక్ ను మనం కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా తేలిక. చాలా సులభంగా కిలో మైసూర్ పాక్ వరకు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ మైసూర్ పాక్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కిలో మైసూర్ పాక్ తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపిండి -ఒకటిన్నర కప్పు, రిఫైండ్ ఆయిల్ – ఒక కప్పు, నెయ్యి – ఒకటిన్నర కప్పు, పంచదార – 2 కప్పులు, నీళ్లు – అర కప్పు, యాలకుల పొడి – అర టీ స్పూన్.
కిలో మైసూర్ పాక్ తయారీ విధానం..
ముందుగా శనగపిండిని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి కలపాలి. దీనిని ఉండలు లేకుండా కలుపుకున్న తరువాత గిన్నెలో నెయ్యి, నూనె వేసి వేడి చేయాలి. నూనె బాగా వేడయ్యాక మంటను చిన్నగా చేసి మరిగిస్తూ ఉండాలి. తరువాత కళాయిలో పంచదార, నీళ్లువేసి వేడి చేయాలి. పంచదార కరిగి తీగ పాకం రాగానే ముందుగా సిద్దం చేసుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేసి కలపాలి. తరువాత యాలకుల పొడి వేసి కలపాలి. శనగపిండి మిశ్రమం ఉడుకుపట్టగానే మరుగుతున్న నూనె నుండి 2 గంటెల నూనెను తీసుకుని పిండిలో వేసుకోవాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకోవాలి.
శనగపిండి మిశ్రమం మరలా ఉడుకుపట్టగానే మరలా రెండు గంటెల నూనె పోసి కలుపుకోవాలి. ఇలా వేడి చేసిన నూనెను పిండిలో పోస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల పిండి గుల్ల గుల్లగా అవుతుంది. పిండి దగ్గర పడగానే చివరగా మిగిలిన రెండు గంటెల నూనె పోసి కలిపి వెంటనే బటర్ పేపర్ వేసిన గిన్నెలోకి తీసుకోవాలి. దీనిని నెమ్మదిగా పైన సమానంగా చేసుకోవాలి. 10నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత మనకు కావల్సిన ఆకారంలో కట్ చేసుకోవాలి. శనగపిండి మిశ్రమం పూర్తిగా చల్లారిన తరువాత ప్లేట్ లోకి తీసుకుని ముక్కలుగా చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా, గుల్ల గుల్లగా ఉండే మైసూర్ పాక్ తయారవుతుంది. ఇలా ఇంట్లోనే చాలా సులభంగా మైసూర్ పాక్ ను తయారు చేసి తీసుకోవచ్చు.