Deep Sleep : మనలో చాలా మంది ఎదుర్కొనే సమస్యలల్లో నిద్రలేమి కూడా ఒకటి. అసలు చెప్పాలంటే మనలో చాలా మందికి పడుకోగానే నిద్ర పట్టదు. అరగంట నుండి గంట పాటు కష్టపడితే కానీ మనలో చాలా మందికి నిద్ర పట్టదు. మరలా ఉదయమే లేచి ఉద్యోగాలకు వెళ్లాలి. దీంతో నిద్ర సరిపోకా రోజంతా నీరసంగా ఉంటారు. ఏ పని చేయాలనిపించు. ఇలాంటి సమస్యతో బాధపడే వారు క్రమంగా నిద్ర మాత్రలకు అలవాటు పడి పోతూ ఉంటారు. ఇటువంటి సమస్య మనకు రాకుండా ఉండాలంటే అలాగే పడుకోగానే నిద్ర పట్టాలంటే ఏం చేయాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. పడుకోగానే నిద్రపట్టకపోవడానికి గల కారణాల్లో ఒత్తిడి కూడా ఒకటి. ఉద్యోగం, ఆర్థిక సమస్యలు, గొడవలు ఇలా అనేక కారణాల చేత మనలో చాలా మంది ఎంతో ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు.
రోజంతా ఆలోచించిన ఈ విషయాలే పడుకోగానే మరలా గుర్తుకు వస్తూ ఉంటాయి. మనసుకు విశ్రాంతి లేకుండా మనం ఆలోచిస్తూ ఉంటాము కనుక సరిగ్గా నిద్ర పట్టదు. ఇలా ఒత్తిడి కారణంగా నిద్ర పట్టని వారు మంచం మీద పడుకున్న తరువాత మన ఆలోచనలను, దృష్టిని మన ముక్కు మీద ఉంచాలి. శ్వాస మీద ధ్యాసను ఉంచాలి. ఇలా చేయడం వల్ల మన దృష్టి ఇతర ఆలోచనల మీదకు వెళ్లకుండా ఉంటుంది. మన ఆలోచన పక్కదారి పడుతున్నప్పటికి దానిని మరలా శ్వాస మీదకు మళ్లించాలి. ఇలా 5 నిమిషాల పాటు చేయడం వల్ల మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ఇలా చేయడం వల్ల క్రమంగా నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటారు. ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. బీపీ తగ్గుతుంది. గుండెకు విశ్రాంతి లభిస్తుంది. ఇలా ధ్యానం చేయడంతో పాటు చక్కగా నిద్ర పట్టాలంటే సాయంత్రం భోజనాన్ని త్వరగా చేయాలి.
సాయంత్రం 6 నుండి 7 గంటల లోపే ఆహారాన్ని తీసుకోవాలి. మనం తిన్న ఆహారం మనం నిద్రించే లోపు జీర్ణం అయ్యి పోవాలి. శరీరానికి పూర్తి విశ్రాంతిని ఇవ్వాలి. అలాగే మనం తీసుకునే ఆహారం చాలా సులభంగా జీర్ణమయ్యేది అయ్యి ఉండాలి. సాయంత్రం భోజనంలో ఎక్కువగా పండ్లను తీసుకోవాలి. అలాగే నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవాలి. షుగర్ తో బాధపడే వారు కూడా డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవాలి. అలాగే కొబ్బరిని తీసుకోవాలి. వీటిలో ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి కనుక షుగర్ పెరగకుండా ఉంటుంది. ఇలా డ్రై ఫ్రూట్స్ ను తీసుకుంటూ పండ్లను తీసుకోవడం వల్ల చాలా సులభంగా జీర్ణమైపోతాయి. దీంతో గాఢ నిద్ర పడుతుంది. ఈ విధంగా ఈ చిట్కాలను పాటించడం వల్ల పడుకోగానే నిద్ర పట్టడంతో పాటు గాఢ నిద్రలోకి జారుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.