Capsicum Rice : మనం వంటింట్లో వివిధ రకాల రైస్ ఐటమ్స్ ను తయారు చేస్తూ ఉంటాము. రైస్ ఐటమ్స్ రుచిగా ఉండడంతో పాటు చాలా సులభంగా వీటిని తయారు చేసుకోవచ్చు. మనం సులభంగా చేసుకోదగిన రుచికరమైన రైస్ ఐటమ్స్ లో క్యాప్సికం రైస్ కూడా ఒకటి. క్యాప్సికంతో చేసే ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి లేదా అన్నం మిగిలినప్పుడు అలాగే నోటికి రుచిగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా క్యాప్సికం రైస్ ను తయారు చేసి తీసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. చాలా తక్కువ సమయంలో దీనిని తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ క్యాప్సికం రైస్ ను ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాప్సికం రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీస్పూన్, ఎండుమిర్చి – 2, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, తరిగిన టమాట – 1, పొడుగ్గా తరిగిన క్యాప్సికం – 2, తరిగిన పచ్చిమిర్చి – 2, అన్నం – ఒక కప్పు బియ్యంతో వండినంత, నిమ్మకాయ – 1, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
క్యాప్సికం రైస్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా వేసి కలపాలి. తరువాత టమాట ముక్కలు వేసి కలపాలి. టమాట ముక్కలు మెత్తబడిన తరువాత క్యాప్సికం ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. వీటిని మెత్తబడే వరకు వేయించిన తరువాత అన్నం వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత నిమ్మకాయ రసం, కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్యాప్సికం రైస్ తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ విధంగా చాలా సులభంగా రుచిగా క్యాప్సికం రైస్ ను తయారు చేసి తీసుకోవచ్చు.