Tamarind Seeds : మనలో చాలా మంది ముఖంపై మంగు మచ్చలతో బాధపడుతూ ఉంటారు. స్త్రీ, పురుషుల బేధం లేకుండా ఈ సమస్య అందరిలో వస్తూ ఉంటుంది. మంగు మచ్చల వల్ల ఎటువంటి నష్టం లేనప్పటికి వీటి వల్ల ముఖం చూడడానికి అందవిహీనంగా కనిపిస్తుంది. మంగు మచ్చల సమస్య నుండి బయటపడడానికి చాలా మంది అనేక రకాల చిట్కాలను పాటిస్తూ ఉంటారు. అలాగే మందులను కూడా వాడుతూ ఉంటారు. సాధారణంగా చర్మం కింద పొరల్లో మెలనోసైట్స్ ఉంటాయి. ఇవి మెలనిన్ అనే నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేస్తాయి. మెలనిన్ ఉత్పత్తి అవ్వడం వల్ల మన జుట్టు నల్లగా ఉంటుంది. అలాగే మెలనిన్ ఉత్పత్తి అయ్యే పరిమాణాన్ని బట్టి మన చర్మం ఎరుపు, నలుపు, తెలుపు రంగుల్లో ఉంటుంది. ఇలా మెలనిన్ ను ఉత్పత్తి చేసే మెలనోసైట్స్ నుండి థైరోసోనైస్ అనే ఎంజైమ్ ఉత్పత్తి అవుతుంది. ఈ ఎంజైమ్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల నలుపు వర్ణం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.
నలుపు వర్ణం ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల చర్మంపై మంగు మచ్చలు ఏర్పడతాయి. ఇలా మంగు మచ్చల సమస్యతో బాధపడే వారు మందులను వాడడానికి బదులుగా సహజంగా లభించే చింత గింజలను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చింతగింజలను తొక్కు పచ్చళ్లు, చిరుతిళ్లు తయారు చేసి తీసుకుంటూ ఉంటారు. కొందరు వీటిని ఎందుకు పనికి రావని పడేస్తూ ఉంటారు. కానీ చింతగింజల్లో కూడా ఔషధ గుణాలు ఉంటాయి. వీటిని వాడడం వల్ల మంగు మచ్చలు పోతాయని నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడించారు. చింతగింజలను పేస్ట్ లాగా లేదా పొడిగా చేసుకుని దానికి తేనెను కలిపి మంగు మచ్చలపై రాయాలి. ఇలా రాయడం వల్ల మెలనోసైట్స్ లో ఎక్కువగా ఉత్పత్తి అయ్యే థైరోసోనైస్ ఎంజైమ్ ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో మెలనిన్ ఉత్పత్తి తగ్గి మంగు మచ్చలు తగ్గుతాయి.
చింతగింజలను వాడడం వల్ల చర్మ కణాలలో వచ్చిన ఇన్ ప్లామేషన్ తగ్గి ఆ భాగంలో మచ్చలు తగ్గుతాయి. అలాగే చింతగింజల పొడిలో తేనె కలిపి లోపలికి తీసుకోవడం వల్ల కూడా మంగు మచ్చలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా చింతగింజలను బాహ్యంగా, లోపలికి వాడడం వల్ల మంగు మచ్చలు నెమ్మదిగా తగ్గి ఆ భాగంలో చర్మం సాధారణ స్థితికి చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. 2012 వ సంవత్సరంలో థాయిలాండ్ దేశ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. ఇలా చింతగింజలను వాడడంతో పాటు మంగు మచ్చల సమస్యతో బాధపడే వారు ఎండలో తిరగకుండా ఉండడం మంచిది. ఒకవేళ ఎండలోకి వెళ్లినా ముఖంపై ఎండ పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే నీటిని ఎక్కువగా తాగాలని నిపుణులు చెబుతున్నారు.