Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Dondakaya Fry : దొండ‌కాయ ఫ్రై ఇలా చేయండి.. ఒక్క ముక్క కూడా విడిచిపెట్ట‌కుండా మొత్తం తినేస్తారు..!

D by D
April 24, 2024
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Dondakaya Fry : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల‌ల్లో దొండ‌కాయ‌లు ఒక‌టి. దొండ‌కాయ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి. దొండ‌కాయ‌ల‌తో ఎక్కువ‌గా చేసే వంట‌కాల్లో దొండ‌కాయ ఫ్రై కూడా ఒక‌టి. దొండ‌కాయ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఒక్కో విధంగా త‌యారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా చేసే దొండ‌కాయ ఫ్రై కూడా చాలా రుచిగా ఉంటుంది. బ్యాచిల‌ర్స్, వంట‌రాని వారు కూడా దీనిని చాలా సుల‌భంగా, చాలా త‌క్కువస‌మ‌యంలో త‌యారు చేసుకోవ‌చ్చు. అన్నంతో తిన‌డానికి, సైడ్ డిష్ గా తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. రుచిగా ఉండ‌డంతో పాటు చాలా సుల‌భంగా చేసుకోగ‌లిగే ఈ దొండ‌కాయ ఫ్రైను ఎలా త‌యారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.

దొండ‌కాయ‌ ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

దొండ‌కాయ‌లు – 300గ్రా., నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, జీల‌కర్ర – అర టీ స్పూన్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, ఉప్పు – త‌గినంత‌, ధ‌నియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, కొబ్బ‌రి పొడి – 2 టేబుల్ స్పూన్స్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Dondakaya Fry if you make like this everybody likes it
Dondakaya Fry

దొండ‌కాయ‌ ఫ్రై త‌యారీ విధానం..

ముందుగా దొండ‌కాయ‌ల‌ను గుండ్రంగా కట్ చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఆవాలు, జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన త‌రువాత దొండ‌కాయ ముక్క‌లు వేసి 2 నిమిషాల పాటు పెద్ద మంట‌పై వేయించాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి మ‌ధ్య‌స్థ మంట‌పై 5 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత దొండ‌కాయ ముక్క‌ల‌ను మ‌రోసారి క‌లిపి మూత పెట్టి దొండ‌కాయ ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. దొండ‌కాయ ముక్క‌లు వేగిన త‌రువాత ప‌సుపు వేసి క‌ల‌పాలి. త‌రువాత కారం, ధ‌నియాల పొడి, గ‌రం మసాలా, ఉప్పు, కొబ్బ‌రి పొడి వేసి అంతా క‌లిసేలా బాగా క‌లుపుకోవాలి. వీటిని మ‌రో 2 నిమిషాల పాటు వేయించిన తరువాత కొత్తిమీర చ‌ల్లి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే దొండ‌కాయ ఫ్రై త‌యార‌వుతుంది. దీనిని ప‌ప్పు, సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ గా తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా త‌యారు చేసిన దొండ‌కాయ ఫ్రైను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Dondakaya Fry
Previous Post

Mosquitoes In Summer : ఈ సీజ‌న్‌లోనూ దోమ‌లు మిమ్మ‌ల్ని ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

Next Post

Banana Peel For Facial Glow : అర‌టి పండు తొక్క‌తో మీ చ‌ర్మం మెరిసిపోతుంది.. ఈ 4 చిట్కాల‌ను పాటించండి..!

Related Posts

మొక్క‌లు

డ‌యాబెటిస్ ఉన్న‌వారికి వ‌రం ఈ మొక్క‌.. ఎంతో మేలు చేస్తుంది..!

July 4, 2025
హెల్త్ టిప్స్

రోజూ వీటిని తినండి.. మీ ఆయుష్షు ఎంత‌గానో పెరుగుతుంది..!

July 4, 2025
హెల్త్ టిప్స్

మిరియాల‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే.. ఎందుకంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

కుంభ మేళాకు నాగ‌సాధువులు ల‌క్షలాదిగా ఒకేసారి వ‌చ్చి ఎలా వెళ్తారు..?

July 4, 2025
Off Beat

స‌హాయం చేసే వారంద‌రూ స్నేహితులు కారు.. గొప్ప క‌థ‌..!

July 4, 2025
mythology

ఫినిక్స్ పక్షి ప్రత్యేకత ఏమిటి ? ఇది వాస్తవంగా గతంలో మనుగడలో వుండిందా ? లేదా ఇదంతా కేవలం కాల్పానికమేనా ?

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.