Watermelon Side Effects : వేసవిలో మనం సహజంగానే శరీరానికి చలువ చేసే ఆహారాలను తింటుంటాం. దీంతో శరీరం చల్లబడుతుంది. వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎండదెబ్బ తగలకుండా ఉంటుంది. అయితే వేసవిలో చాలా మంది తినే ఇలాంటి చల్లని ఆహారాల్లో పుచ్చకాయలు కూడా ఒకటి. ఈ సీజన్‌లో మనకు ఇవి విరివిగా లభిస్తాయి. చాలా మంది వీటిని కొని తింటుంటారు. పుచ్చకాయలతో మనం పలు రకాల డ్రింక్‌లను కూడా తయారు చేసి తాగవచ్చు. అయితే పుచ్చకాయలను తినడం వల్ల మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలిగినప్పటికీ వీటిని అతిగా తినరాదు. అతిగా తినడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
పుచ్చకాయలను అతిగా తినడం వల్ల డయేరియా వచ్చే అవకాశాలు ఉంటాయి. విరేచనాలు అవుతాయి. అలాగే జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల పుచ్చకాయలను మోతాదులోనే తినాలి. ఇక వీటిని ఎక్కువగా తినడం వల్ల గ్లూకోజ్ లెవల్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి. దీంతో షుగర్ పెరుగుతుంది. డయాబెటిస్ ఉన్నవారికి అయితే ఇది అసలు మంచిది కాదు. కనుక పుచ్చకాయలను పరిమిత మోతాదులోనే తీసుకోవాల్సి ఉంటుంది.
ఇక పుచ్చకాయలను అతిగా తినడం వల్ల లివర్ వాపులకు గురయ్యే అవకాశం ఉంటుంది. దీంతో లివర్ పనితీరు మందగిస్తుంది. అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే వీటిని ఎక్కువగా తింటే ఓవర్ హైడ్రేషన్ అయ్యే చాన్స్ ఉంటుంది. అంటే శరీరంలో నీటి శాతం ఎక్కువ కావడం వల్ల వచ్చే సమస్య అన్నమాట. దీంతోపాటు గుండె సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కనుక పుచ్చకాయలను ఎవరైనా సరే మోతాదులోనే తినాలి. అధికంగా తినకూడదు. ఇది మనకు ప్రయోజనాలనే అందిస్తుంది. కానీ తక్కువ మోతాదులో తింటేనే మనం ఆ ప్రయోజనాలను పొందగలం. లేదంటే ఇబ్బందులు తప్పవు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.