Cool Drinks : సాధారణంగా వేసవి కాలంలో చాలా మంది సహజంగానే కూల్ డ్రింక్స్‌ను తాగేందుకు ఇష్టపడుతుంటారు. అయితే కొందరు వేసవిలోనే కాదు.. ఇతర సీజన్లలోనూ వాతావరణం ఎలా ఉన్నా సరే కూల్ డ్రింక్స్‌ను అదే పనిగా తాగుతుంటారు. అయితే కూల్ డ్రింక్స్‌ను ఎక్కువగా తాగడం అంత మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కూల్ డ్రింక్స్ మన ఆరోగ్యానికి హాని చేస్తాయని, వీటిని ఎప్పుడో ఒకసారి అయితే ఫర్వాలేదు కానీ తరచూ తాగకూడదని వారు అంటున్నారు. కూల్ డ్రింక్స్‌ను ఎక్కువగా తాగడం వల్ల ఎలాంటి అనర్థాలు సంభవిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
కూల్ డ్రింక్స్‌లో కెఫీన్ అధికంగా ఉంటుంది. ఇది మన శరీరంలో విపరీత మార్పులకు కారణం అవుతుంది. ముఖ్యంగా నిద్ర పట్టకుండా చేస్తుంది. కూల్ డ్రింక్స్‌ను అతిగా తాగడం వల్ల నిద్రలేమి సమస్య వస్తుంది. రాత్రిపూట అసలు నిద్రించలేరు. అందువల్ల వీటికి దూరంగా ఉండాలి. ఇక ఈ డ్రింక్స్‌ను తాగడం వల్ల వాటిల్లో అధికంగా ఉండే చక్కెర మన శరీరంలోకి చేరుతుంది. ఇది డయాబెటిస్ ను కలగజేస్తుంది. దీంతోపాటు అధికంగా బరువు పెరిగే చాన్స్ ఉంటుంది. ఇది గుండె, లివర్‌కు ఏమాత్రం మంచిది కాదు. ఆయా భాగాలకు చెందిన జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
కూల్ డ్రింక్స్‌ను తాగడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. దీంతో వికారం, విరేచనాలు వంటి సమస్యలు ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే ఎముకలు గుల్లగా మారి బలహీనంగా తయారవుతాయి. త్వరగా లేదా సులభంగా ఎముకలు విరిగిపోయే అవకాశాలు ఉంటాయి. కూల్ డ్రింక్స్‌ను ఎక్కువగా తాగితే మన శరీరం మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను సరిగ్గా శోషించుకోలేదు. దీంతో పోషకాహార లోపం వస్తుంది. అలాగే కడుపులో మంట, అసిడిటీ, గ్యాస్ సమస్యలు వస్తాయి.
కూల్ డ్రింక్స్‌ను అతిగా సేవిస్తే శరీరంలో సోడియం ఎక్కువగా చేరుతుంది. ఇది కిడ్నీలపై భారం పడేలా చేస్తుంది. దీంతోపాటు బీపీ పెరుగుతుంది. ఇలా అనేక రకాల అనర్థాలు కలిగే అవకాశాలు ఉంటాయి. కనుక కూల్ డ్రింక్స్‌ను తాగేటప్పుడు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోండి. లేదంటే చేతులారా మీ ఆరోగ్యాన్ని మీరే పాడు చేసుకున్న వారు అవుతారు. ఆ తరువాత బాధపడీ ప్రయోజనం ఉండదు.