High Cholesterol Symptoms : మనం పాటించే జీవన విధానం, తీసుకునే ఆహారంతోపాటు ఇతర అనేక కారణాల వల్ల మన శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ పెరిగిపోతుంటాయి. దీంతో మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే కొలెస్ట్రాల్ లెవల్స్ అధికంగా ఉండడం ప్రమాదం. దీంతో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయి హార్ట్ ఎటాక్ వచ్చే చాన్స్ ఉంటుంది. కనుక కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఇక కొలెస్ట్రాల్ లెవల్స్ ఎక్కువగా ఉంటే మన శరీరం మనకు పలు లక్షణాలను తెలియజేస్తుంది. వాటిని గుర్తించడం ద్వారా మన శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందని నిర్దారించుకోవచ్చు. ఇక ఆ లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటే కాళ్లలో రక్త సరఫరా సరిగ్గా ఉండదు. దీంతో కాళ్లు వాపులకు లోనవుతాయి. ముఖ్యంగా కాలి మడమలు వాపులకు గురై కనిపిస్తాయి. ఆ ప్రాంతంలో వేలితో నొక్కితే సొట్టపడి లోపలికి పోతుంది. ఇలా గనక ఉంటే కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని అర్థం చేసుకోవాలి. అలాగే రాత్రి పూట చేతులు, కాళ్లు విపరీతంగా నొప్పులకు గురవుతుంటే మీ శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ ఎక్కువగా ఉన్నాయని అర్థం చేసుకోవాలి.
కాళ్లలో అసౌకర్యంగా ఉంటుంది..
కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటే కాళ్లలో అసౌకర్యంగా ఉంటుంది. నడవలేకపోతుంటారు. కాళ్లలో సూదులతో గుచ్చినట్లు ఉంటుంది. కాళ్లు తిమ్మిర్లకు గురవుతాయి. అదేవిధంగా చేతులు, కాళ్లు చల్లబడుతుంటాయి. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే చర్మం రంగులోనూ మార్పు వస్తుంది. ముఖ్యంగా చర్మం నీలి రంగులో లేదా ఎరుపు రంగులో కనిపిస్తుంది. రాత్రి పూట ఇలా ఎక్కువగా జరుగుతుంది.
కనుక ఈ లక్షణాలు ఎవరిలో అయినా కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవాలి. కొలెస్ట్రాల్ లెవల్స్ ఎక్కువగా ఉన్నట్లు తేలితే వెంటనే చికిత్స తీసుకోవాలి. దీంతో డాక్టర్ మీకు కొలెస్ట్రాల్‌ను తగ్గించే మందులను ఇస్తారు. ఇక ఈ మందులతోపాటు మీరు పలు ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే.. పీచు ఎక్కువగా ఉన్న ఆహారాలను తినాలి. ముఖ్యంగా ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్స్‌ను తినాలి. దీంతోపాటు తాజా పండ్లు, కూరగాయలను తినాలి. నూనె ఎక్కువగా ఉండే పదార్థాలు, జంక్ ఫుడ్స్, చిరు తిండ్లకు దూరంగా ఉండాలి. పొగ తాగడం మానేయాలి. మద్యం సేవించకూడదు. రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. రోజూ 8 గంటల పాటు నిద్రించాలి. ఇలాంటి జాగ్రత్తలను పాటిస్తే కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు.