సాధారణంగా మనం నిత్యం వంటలలో ఉప్పు వాడుతుంటాం. అయితే ఈ మధ్య కాలంలో ఆరోగ్యాన్ని దృష్టి పెట్టుకొని ఉప్పు వాడకాన్ని తగ్గిస్తున్నారు. నిజానికి శరీర అవయవాలు సక్రమంగా పనిచేయడానికి కొద్ది మొత్తంలో ఉప్పు అవసరం. కానీ ఒక నెల పాటు ఉప్పు తినకపోతే ఆరోగ్యం మీద ఏం ప్రభావం పడుతుంది? అనే సందేహాలు మనకు రావడం కామన్. కొంతమంది మతపరమైన కారణాల వల్ల లేదా ఆరోగ్యం కోసం కొంతకాలం ఉప్పు తినరు. కానీ, ఉప్పును పూర్తిగా మానేస్తే శరీరం, మనసు రెండూ ప్రభావితమవుతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం.. ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు 4 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తినకూడదు. కానీ ఉప్పు పూర్తిగా నిషేధిస్తే మాత్రం డేంజర్ అంటున్నారు నిపుణులు.
నిజానికి ఉప్పు మన శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. తగినంత ఉప్పు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. కానీ దీన్ని తీసుకోవడం మానేస్తే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎక్కువ రోజులు ఉప్పు తీసుకోకపోతే, కొన్ని సందర్భాల్లో కోమాలోకి వెళ్లే ఛాన్స్ ఉందంటున్నారు నిపుణులు. అదే 30 రోజులు ఉప్పు తినకపోతే ఏమవుతుంది? అంటే క్రమంగా బరువు తగ్గుతారు. 30 రోజులు ఉప్పు తినకపోతే శరీరం తక్కువ తినడానికి అలవాటు పడుతుంది. ఇది మీ పొట్ట, నడుము కొవ్వును తగ్గిస్తుంది. కానీ ఒక్కసారిగా ఎక్కువ బరువు తగ్గితే ఆరోగ్యం మరింత క్షీణిస్తుందని గుర్తుంచుకోవాలి.సాల్టీ ఫుడ్స్‌లో చాలా కేలరీలు ఉంటాయి. వీటికి దూరంగా ఉంటే కేలరీల ఇన్‌టెక్ తగ్గుతుంది. సాల్టీ ఫుడ్స్ మానేస్తే హెల్తీ ఫుడ్స్ తింటాం కాబట్టి శరీరంలోని, ముఖ్యంగా కడుపు, నడుము చుట్టూ ఉన్న కొవ్వు తగ్గుతుంది. బ్లోటింగ్ వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. అయితే, చాలా త్వరగా బరువు తగ్గితే ఆరోగ్యానికి హాని కలగవచ్చు.
ఉప్పు డైజెషన్‌కు కూడా అవసరం కాబట్టి సడన్‌గా సాల్టిపుట్స్ మానేస్తే డైజెస్టివ్ సిస్టమ్ అడ్జస్ట్ కాలేక పోతుంది. సాల్ట్‌కు బదులు ఫైబర్-రిచ్ ఫ్రూట్స్ వంటివి తింటే వాటిని అరిగించుకోవడానికి డైజెస్టివ్ సిస్టమ్‌కు కష్టమైపోతుంది. దీంతో కడుపు నొప్పి, ఇతర అజీర్తి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఉప్పును పూర్తిగా మానేస్తే బ్రెయిన్ మీద కూడా ప్రభావం పడుతుంది. ఇది ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలకు దారితీయవచ్చు. ఒత్తిడిని నియంత్రించే హార్మోన్ల విడుదల కూడా ప్రభావితం అవుతుంది. సోడియం తక్కువైతే ఈ హార్మోన్ల బ్యాలెన్స్ తప్పుతాయి. దీంతో కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్ల స్థాయి పెరుగుతుంది.