మన ఇంటి పరిసర ప్రాంతాలలో బొప్పాయి చెట్లని విరివిగా చూస్తుంటాం.బొప్పాయి ఆరోగ్య, సౌందర్య ప్రయోజనాల గురించి అందరికీ తెలుసు. బొప్పాయి ఆకులు కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. బొప్పాయి ఆకుల రసాన్ని రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచడానికి పురాతన కాలం నుండి ఉపయోగిస్తూనే ఉన్నారు.బొప్పాయి ఆకులను జ్యూస్ చేసి తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బొప్పాయి జ్యూస్ తాగడం వల్ల జ్వరాలు రాకుండా రక్షిస్తుంది. బొప్పాయి ఆకుల రసంలో విటమిన్లు ఎ, ఇ, సి, కె, బి లు అధికంగా ఉంటాయి. ఈ జ్యూస్ తాగడం వల్ల జ్వరాలు రాకుండా రక్షిస్తుంది.
యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్‌తో నిండిన బొప్పాయి రసం ఆర్థరైటిస్‌ను కంట్రోల్ చేస్తుంది. గౌట్, ఇతర ఇన్ఫ్లమేటరీ లక్షణాలను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా వాపును దూరం చేస్తుంది. బొప్పాయి ఆకు రసం సాధారణంగా డెంగ్యూ జ్వరంతో సంబంధం ఉన్న లక్షణాల చికిత్సకు ఉపయోగిస్తారు. డెంగ్యూ సాధారణ లక్షణాలు జ్వరం, అలసట, తలనొప్పి, వికారం, చర్మంపై దద్దుర్లు, వాంతులు. కొన్ని తీవ్రమైన సందర్భాల్లో ఇది తక్కువ ప్లేట్‌లెట్ కౌంట్‌కు కూడా కారణమవుతుంది. ఇది రక్తస్రావం ప్రమాదాన్ని పెంచుతుంది. బొప్పాయి ఆకు రసం మధుమేహం చికిత్సకు, రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరచడానికి సహజ ఔషధంగా ఉపయోగిస్తారు.
బొప్పాయి ఆకు సారం యాంటీ ఆక్సిడెంట్లు, బ్లడ్ షుగర్ తగ్గించే ప్రభావాలను కలిగి ఉంటుంది. ప్యాంక్రియాస్‌లోని ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలను దెబ్బతినకుండా రక్షించడానికి ఇది జంతు అధ్యయనాలలో కనుగొనబడింది.బొప్పాయి ఆకు టీ గ్యాస్ట్రలెన్స్, ఊబకాయం, గుండెల్లో మంట వంటి జీర్ణ సమస్యలను తగ్గించడానికి ఉపయోగిస్తారు. బొప్పాయి ఆకుల్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియ ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఇది ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలను జీర్ణం చేయగలదు. ఇది మలబద్ధకం, గుండెల్లో మంట వంటి లక్షణాల నుండి ఉపశమనం పొందడంలో కూడా సహాయపడుతుంది.బొప్పాయి ఆకుల రసాన్ని తలకు పట్టించడం వల్ల జుట్టు ఎదుగుదలకు, ఆరోగ్యానికి మంచిది.రసాన్ని రుచికరంగా చేయడానికి మీరు కొంచెం ఉప్పు లేదా చక్కెరను జోడించవచ్చు. రోజులో మూడు పూటలా తక్కువ మెుత్తంలో తీసుకోవాలి. లేదంటే వారానికి మూడు సార్లు తీసుకోవచ్చు. బొప్పాయి రసాన్ని ఎక్కువగా తాగితే కాలేయంపై ప్రభావం పడుతుంది.