ఎందుకో కొందరికి అదృష్టం కలిసి రాదు. ఎంత కష్టపడినా కూడా ఆశించిన ఫలితాలు అందుకోరు.ఎప్పుడూ ఎవరో ఒకరు జబ్బు పడుతూనే ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతుందనేది అర్థం కాదు. వాస్తు ఇలాంటి విషయాల గురించి చాలా క్షుణ్ణంగా చర్చిస్తుంది. వాస్తును అనుసరించి కొన్ని వస్తువులు పొరపాటున కూడా వంటగదిలో పెట్టుకోకూడదు. ఇంటిలో అతి కీలకంగా భావించే వంటగదిలో ఉండాల్సిన వస్తువుల విషయంలో కూడా వాస్తు నియమాలను తప్పక పాటించాలని నిపుణులు అంటున్నారు. లేదంటే నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుందని.. ఫలితంగా కుటుంబ సభ్యుల అభివృద్ధి దెబ్బతింటుందని, ఆర్థిక సమస్యలతో పాటు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు.
కిచెన్‌ను అన్నపూర్ణాదేవి నివాస స్థలంగా భావిస్తారు. మహిళలు కూడా ఎక్కువ టైమ్ అక్కడే గడుపుతారు. కాబట్టి, వంటగదిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా రోజూ రాత్రి పడుకునే ముందు కిచెన్‌లో తిన్న పాత్రలు పేరుకుపోకుండా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలంటున్నారు. డస్ట్బిన్లను క్రమం తప్పకుండా శుభ్రపరిచేలా చూసుకోవాలట. అలాగే చెత్త డబ్బా ఎల్లప్పుడూ మూతతో కప్పి ఉండేలా జాగ్రత్తపడాలంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. వంటగదిలో ఎప్పుడూ విరిగిన పాత్రలను ఉంచవద్దు. ఎవరైనా తినడానికి మరియు త్రాగడానికి విరిగిన పాత్రలను ఉపయోగిస్తే, అలా చేయడం వల్ల ఆ వ్యక్తికి దురదృష్టం వస్తుంది.చీపురు మీ వంటగదిలో ఎప్పుడూ ఉంచకూడదు. వంటగదిలో చీపురు సరైన స్థలంలో ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే దరిద్రం పడుతుంది.
వంటగదిలో ప్లాస్టిక్ పాత్రలు కూడా ఉంచకూడదు. ఇవి ప్రతికూల శక్తికి మూలంగా మారతాయి, బదులుగా మనం స్టెయిన్లెస్ స్టీల్, కలప మరియు ప్రతికూల శక్తిని తగ్గించగల ఇతర రకాల కంటైనర్లను ఉపయోగించాలి. వంటగది లోపల ఎప్పుడూ ఆలయాన్ని ఏర్పాటు చేయకూడదు ఎందుకంటే వంటగదిలో అక్కడక్కడ వస్తువులు చెల్లాచెదురుగా ఉంటాయి. మురికి పాత్రలు కూడా ఉంచబడతాయి. అందువలన ఆలయాన్ని ఏర్పాటు చేయకపోవడం మంచిది అంటారు వాస్తు నిపుణులు. ఇక వంటగదిలో అద్దం పెట్టుకోవడం కూడా చేయరాదంటారు. మందులు కూడా వంటగదిలో ఉంచకూడదు ఎందుకంటే మందులు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి మరియు ఇంట్లో ప్రతికూలతను సృష్టించగలవు.