ప్రతి ఒక్కరికి ఆకాశంలో ప్రయాణం చేయాలని ఉంటుంది. అది నిజంగా మంచి అనుభూతిని ఇస్తుంది. అయితే కొన్ని కొన్ని సార్లు భయంకరమైన అనుభూతిని కూడా మిగులుస్తుంది. 24 వేల అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోతే ఎలా ఉంటుంది..? ఏప్రిల్ 28, 1988లో ఇదే చోటుచేసుకుంది. అలోహ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 243 హిలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరింది. టెక్ ఆఫ్ అయిన తర్వాత పైలట్ రాబర్ట్ పెద్ద పేలుడిని విన్నారు.
అది చాలా వింతగా అనిపించిందని.. సాధారణంగా లేదని ఆయనకు అర్థమైంది. విమానం పైకప్పు కి చెందిన ఒక పెద్ద భాగం ఎగిరిపోయి పడిపోయిందట. ఒక్క సారిగా ఫ్లైట్ లో ఉన్న ప్యాసింజర్లు అందరూ భయపడిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో పైలెట్ ప్రశాంతంగా డీల్ చేశారు.
పైలెట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. క్రూ మెంబర్స్ ఆక్సిజన్ మాస్క్లని పెట్టుకోవాలని సీట్ బెల్ట్లని ధరించాలని ప్రయాణికుల్ని అలర్ట్ చేశారు. పైకప్పు ఎగిరిపోయినప్పటికీ మెయిన్ స్ట్రక్చర్ అంతా కూడా బానే ఉంది. పైలెట్ అలాగే అక్కడ ఉన్న టీం బాగా స్పందించి ప్రయాణికులు చేశారు. వెంటనే ప్రమాదం తప్పింది.