Blue Gem : నీలమణి, మహామణి, ఇంద్రనీలము మొదలైన నీల రత్నములను ధరించడం వలన అనేక లాభాలు కలుగుతాయి. శరీరములో ఓజశక్తి అభివృద్ధి చెందుతుంది. అలానే నూతన ఉత్సాహం కలుగుతుంది. ధైర్యం కలుగుతుంది. నీలాన్ని ధరించడం వలన వ్యాపార, ఉద్యోగ, వ్యవసాయ మొదలు ఇతర వృత్తులలో అనుకూలత కలుగుతుంది. పురోభివృద్ధి ఉంటుంది. ధన లాభం కలుగుతుంది. ఆదాయం అభివృద్ధి చెందుతుంది. మర్యాదలు పెరుగుతాయి.
వివాహానికి ఏమైనా ఆటంకాలు కలిగినట్లయితే అవి తొలగిపోయి పెళ్లి అవుతుంది. మానసిక వ్యాధుల నుండి కూడా బయటపడవచ్చు. శనిగ్రహ దోషముల నుండి కూడా బయటపడవచ్చు. అలానే కీళ్ల నొప్పులు, పక్షవాతము, అజీర్తి సమస్యలు, కాళ్లు, కాళ్లు పిక్కలకు సంబంధించిన రోగములు, త్రాగుడు, ఊపిరితిత్తుల సమస్యలు, దృష్టి దోషములు ఇటువంటివన్నీ కూడా నీలముతో తొలగిపోతాయి. దీనివలన ఏకాగ్రత కూడా పెరుగుతుంది.
ముఖ్యంగా దరిద్ర బాధలు తొలగిపోతాయి. కష్టాలు, చికాకులు వంటివి తొలగిపోతాయి. దోషము లేని ఉత్తమమైన జాతి నీలము. పంచలోహము లేదా బంగారముతో ధరించడం మంచిది. ఉంగరం అడుగుభాగం రంధ్రముగా ఉంచి పై భాగంలో విల్లు ఆకారముగా, మధ్యభాగాన నీలము బిగించి షోడశోపచార పూజలు చేసి సుముహూర్తంలో ధరించాలి. నీలం రత్నాన్ని ఉంగరం వేలుకి పెట్టుకోకూడదు.
నీల రత్నములోని కాంతి కిరణాలు చర్మం యొక్క రంధ్రాల నుండి శరీర అంతర్భాగాలలో వ్యాపించి ఉన్న అనాహత శాంతికిరణాల దీప్తిని కలిగించడం ద్వారా బాధలన్నీ పోతాయి. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రములలో పుట్టిన వాళ్లు ఎప్పుడైనా నీలాన్ని ధరించవచ్చు. ఉత్తర, ఉత్తరాషాడ, కృత్తిక నక్షత్రం వాళ్ళు తప్ప మిగిలిన అందరూ కూడా వారి జన్మ జాతక గ్రహ స్థితిని అనుసరించి శనిగ్రహం బలహీనుడై దోషప్రదునిగా ఉన్నప్పుడు, నీలరత్నంని ధరిస్తే మంచి జరుగుతుంది. అశుభములు వుండవు.