Silk Smitha : కొంతమంది నటీనటులు భౌతికంగా మనకు దూరమైనా వారు నటించిన సినిమా ద్వారా ఎల్లప్పుడూ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. అలాంటి నటీనటులలో సిల్క్ స్మిత కూడా ఒకరు. తన మత్తు కళ్ళ సోయగాలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. అప్పట్లో సిల్క్ స్మితకు ఉండే డిమాండ్ హీరోలకు కూడా ఉండేది కాదు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న సిల్క్ స్మిత జీవితం ఎంతో మందికి ఆదర్శం. సినిమాల్లో నటించిన సిల్క్ స్మిత నిజ జీవితం మరో పెద్ద సినిమా అని చెప్పవచ్చు.
ఎంతో స్టార్ డమ్ సంపాదించిన సిల్క్ స్మిత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. సీతాకోకచిలుక చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది సిల్క్ స్మిత. దాదాపు మూడు వందల చిత్రాలకు పైగా నటించింది. తన అందం, అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. 1983 లో ఒక్క సంవత్సరంలోనే దాదాపు 45 చిత్రాలకు పైగా నటించి ఆమె ప్రపంచ రికార్డును సృష్టించింది.
సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మొదట్లో సిల్క్ స్మిత మేకప్ ఆర్టిస్ట్ గా పనిచేసేది. ఆమెను చూసి ఓ దర్శకుడి భార్య చాలా అందంగా ఉందని చెప్పడంతో ఆ డైరెక్టర్ చిత్రంలో సైడ్ డ్యాన్సర్ గా అవకాశం అందుకుంది. ఆ తరవాత తన తన మత్తు కన్నుల మాయతో కుర్రవాళ్ళకు మత్తెక్కించడంతో వరుస ఆఫర్ లను అందుకుంది. స్టార్ హీరోలు సైతం ఆమె డేట్స్ కోసం వేచి చూసే స్థాయికి సిల్క్ స్మిత ఎదిగింది. ఇంత పాపులారిటీ సంపాదించుకున్న సిల్క్ స్మిత తన చివరి రోజుల్లో ఎన్నో కష్టాలను అనుభవించింది.
మెల్లమెల్లగా అవకాశాలు తగ్గడంతోపాటు నా అనుకొనే అయినవాళ్లే మోసం చేయడంతో చివరికి డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. ఆ డిప్రెషన్ లో ఉన్న సమయంలోనే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ మత్తుపదార్థాలకు బానిసైంది. అంతే కాకుండా తనను ఓ వ్యక్తి మోసం చేశాడంటూ చివరికి లెటర్ రాసి ఆత్మహత్య చేసుకుని ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది. సిల్క్ స్మిత తెలుగుతోపాటు తమిళ, కన్నడ భాషల్లో కూడా అనేక సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఆమెకు అన్ని భాషల్లోనూ నటీనటులైన ఎంతో మంది స్నేహితులు ఉన్నారు.
సిల్క్ స్మిత కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్ మంచి స్నేహితులు. వీరిద్దరూ మొదటిసారిగా హల్లి మేస్త్రు అనే సినిమాలో కలసి నటించారు. షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయంతో ఇద్దరూ చాలా క్లోజ్ గా ఉండేవారు. ఆమె తన జీవితంలోని అన్ని విషయాలను తనతో షేర్ చేసుకునేదని రవిచంద్రన్ ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. చనిపోయే ముందురోజు ఆమె తనకు ఫోన్ చేసిందని రవిచంద్రన్ తెలిపారు. కానీ తాను సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉండటం వల్ల ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయానని తెలిపారు. మామూలు కాల్ అనుకుని నేను తిరిగి ఫోన్ కూడా చేయలేదని అన్నారు. ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేసి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండి సిల్క్ స్మిత బ్రతికి ఉండేదేమో అని ఆ ఇంటర్వ్యూలో రవిచంద్రన్ ఆవేదన వ్యక్తం చేశారు.