Mustard Oil For Hair : చాలామంది, కురులు బలంగా పెరగడానికి కష్టపడుతూ ఉంటారు. అందమైన కురులని సొంతం చేసుకోవడానికి, ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. ఈ రోజుల్లో మారిన వాతావరణ పరిస్థితులు, జీవనశైలి పరిస్థితిలు అలానే పోషకాహార లోపం, మొదలైన కారణాల వలన చాలామంది జుట్టు రాలిపోవడంతో బాధపడుతున్నారు. జుట్టు సమస్యలు ఉన్నట్లయితే, ఇలా చేయడం మంచిది. ఈ విధంగా మీరు ఆచరించినట్లయితే, మీ జుట్టు బాగా ఎదుగుతుంది. ఒత్తుగా పెరుగుతుంది. ఒక గిన్నెలో 100 గ్రాముల దాకా ఆవ నూనె ని తీసుకోండి. ఇందులోని నాలుగు కుంకుడుకాయలను కూడా గింజలు తీసేసి వేసుకోండి.
ఇప్పుడు రెండు శీకాకాయల్ని ముక్కలు కింద కట్ చేసి వేసుకోండి. ఆ తర్వాత ఏడు లేదా ఎనిమిది ఉసిరికాయల్ని కూడా ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. ఒక స్పూన్ కలోంజీ విత్తనాలు కూడా వేయండి. ఒక స్పూన్ మెంతుల్ని కూడా వేసి, పొయ్యి మీద పెట్టి ఒక ఐదు నిమిషాలు లేదా ఏడు నిమిషాలు దాకా మరిగించుకోండి. చల్లారిన తర్వాత వడకట్టేసి గాజు సీసాలో దీనిని మీరు నిల్వ చేసుకోవాలి.
ఈ నూనె జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల దాకా రాసి, రెండు గంటలు అలా వదిలేసి తర్వాత కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే, ఫలితం ఉంటుంది. కుంకుడు కాయలతో జుట్టు స్ట్రాంగ్ గా ఉంటుంది. అలానే, జుట్టు చాలా మృదువుగా కూడా ఉంటుంది.
ఉసిరికాయ జుట్టుకి పోషణని ఇస్తుంది. కుదుళ్ళు బలంగా ఎదిగేటట్టు కూడా ఇది చూస్తుంది. మెంతులు కుదుళ్ల ఆరోగ్యానికి బాగా ఉపయోగ పడతాయి. పూర్వకాలం నుండి కూడా, మెంతులని అందమైన కూరలు కోసం వాడుతున్నారు. జుట్టు రాలడం తగ్గుతుంది. చుండ్రు లేకుండా మెంతులు చూస్తాయి.