Diabetes : డయాబెటిస్ సమస్య ప్రస్తుత తరుణంలో చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. టైప్ 2 డయాబెటిస్ బారిన చాలా మంది పడి అవస్థలకు గురవుతున్నారు. అయితే టైప్ 2 డయాబెటిస్ వచ్చిన వారు పలు జాగ్రత్తలు పాటిస్తే దాంతో షుగర్‌ను అదుపులోనే ఉంచుకోవచ్చు. కచ్చితంగా నియమాలను పాటిస్తే దాన్ని వెనక్కి మళ్లించవచ్చు కూడా. ఈ క్రమంలోనే షుగర్ ఉన్నవారు పాటించాల్సిన నియమాల గురించి వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ప్రస్తుత తరుణంలో చాలా మంది నిత్యం అనేక సందర్భాల్లో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇది సకల సమస్యలకు కారణమవుతోంది. ఒత్తిడి వల్ల టైప్ 2 డయాబెటిస్‌తోపాటు గుండె జబ్బులు వచ్చేందుకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. కనుక ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. నిత్యం యోగా, ధ్యానం చేయడంతోపాటు పుస్తకాలను చదవాలి. మనస్సుకు నచ్చిన సంగీతం వినాలి. ప్రకృతిలో గడపాలి. దీంతో ఒత్తిడి తగ్గుతుంది. తద్వారా షుగర్ లెవల్స్ తగ్గుతాయి.
2. చాలా మంది డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా, చపాతీలను తినాలా ? అని సందేహాలను వ్యక్తం చేస్తుంటారు. అయితే పూర్తిగా అన్నం మానేయాల్సిన పనిలేదు. కానీ అతిగా తినరాదు. మధ్యాహ్నం కొద్దిగా అన్నం తింటే చాలు. దానికి ముందుగా వెజిటబుల్ సలాడ్ తినాలి. దీంతో షుగర్ పెరగకుండా చూసుకోవచ్చు. ఇక రాత్రి పూట చపాతీలను రెండింటిని తినాలి. దాంతోపాటు కొవ్వు తీసిన పాలను తాగాలి. అందులో పసుపు లేదా దాల్చిన చెక్క పొడి కలిపి తాగితే ఇంకా మంచిది. ఇక రాత్రి భోజనంలోనూ వెజిటబుల్ సలాడ్ తింటే మంచింది. దీంతో మరుసటి రోజు ఉదయం షుగర్ లెవల్స్ పెరగకుండా చూసుకోవచ్చు.
3. డయాబెటిస్ ఉన్నవారికి కాకరకాయ ఎంతగానో మేలు చేస్తుంది. అందువల్ల రోజూ కాకరకాయను తినాలి. దీన్ని నేరుగా తినలేమని అనుకునేవారు రోజూ ఉదయాన్నే పరగడుపున కాకరకాయ జ్యూస్‌ను 30 ఎంఎల్ మోతాదులో తాగాలి. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి.
4. షుగర్ ఉన్నవారు షుగర్ ఫ్రీ స్వీట్లను తినవచ్చా ? వద్దా ? అని సందేహిస్తుంటారు. అయితే అవి నిజానికి శరీరానికి చేసే మేలు కన్నా కీడే ఎక్కువగా ఉంటుంది. కనుక వాటిని మానేయాలి.
5. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు రోజూ ఆకు కూరలను, పండ్లను ఎక్కువగా తినాలి. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి.
ఈ విధంగా నియమాలను పాటిస్తే షుగర్‌ను వెనక్కి మళ్లించవచ్చు. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.