Coffee : కాఫీ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన హాట్ పానీయాలలో ఒకటిగా ఖ్యాతిని కలిగి ఉంది. అందువల్ల ఈ పానీయం మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. పనిలో కఠినమైన ఒత్తిడి నుంచి కాఫీ బయట పడేస్తుంది. కాఫీని రోజూ తాగడం వల్ల ఎలాంటి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. నిత్యం చాలా మంది ఒత్తిడి, ఆందోళనలతో సతమతం అవుతుంటారు. అలాంటి వారు కాఫీని తాగితే ఒత్తిడి నుంచి బయట పడేస్తుంది. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. మూడ్ మారుతుంది.
2. కాఫీ తాగడం వల్ల వృద్ధాప్యంలో వచ్చే డిమెన్షియా, అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.
3. క్రమం తప్పకుండా కాఫీని తాగడం వలన హార్మోన్ ఎపినెఫ్రిన్ పెరుగుతుంది. ఇది శారీరక పనితీరు, కండరాల బలాన్ని మెరుగు పరుస్తుంది. మెదడును యాక్టివ్‌గా ఉంచుతుంది. శక్తి స్థాయిలను పెంచుతుంది.
4. కాఫీలో మెగ్నీషియం, మాంగనీస్, విటమిన్ బి అధికంగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది.
అయితే కాఫీ తాగడం వల్ల ప్రయోజనాలు కలిగినప్పటికీ దీన్ని రోజుకు 2 నుంచి 4 కప్పుల వరకు మాత్రమే తాగాలి. అధికంగా తాగితే అనర్థాలు సంభవిస్తాయి.