రోడ్ పైన అమ్మాయిని చూడగానే సడన్ గా ఏముందిరా అమ్మాయి అని మనసులో అనుకోవడమో,సూపర్ ఉంది కదా అని పక్కన ఉన్న ఫ్రెండ్స్ తో అనడమో చేస్తుంటారు అబ్బాయిలు.వీలుంటే తనతో మాట కలపడానికి ప్రయత్నించడం,లేదంటే కాంటక్ట్ నంబర్ తీసుకుని ఫ్రెండ్షిప్,తద్వారా ప్రేమ ..ఇలా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. .కానీ అబ్బాయిల విషయంలో అమ్మాయిలు అంత తొందరగా బయటపడరు.కానీ ఒక అబ్బాయిని చూడగానే ఐ మీన్ అందరిని కాదు,అప్పుడప్పుడు గ్రీకువీరుడు లాంటి కుర్రాడు కనపడగానే అమ్మాయిలు ఏవిధంగా అనుకుంటారని కొన్ని ఉదాహరణలు మీకోసం..
ఏమున్నాడే..ఎక్కడుంటారు వీళ్లంతా ..మన చుట్టాల్లోనో,క్లాస్మేట్స్ లోనో ఎందుకుండరు..మన చుట్టు ఉంటారు సోడాబుడ్డి కళ్లద్దాలేసుకుని,పాపిడ తీసి తలదువ్వుకుని కుర్రాళ్లు అనుకుంటూ బాదపడడం. కనీసం పేరు తెలిసినా చాలు,సోషల్ మీడియాలో వెతికితే మొత్తం జాతకం మన చేతిలోనే తర్వాత పడేయడం చాలా ఈజీ.. పేరు కనుక్కోవడం ఎలా…డైరెక్ట్ గా అడిగేద్దామా..అమ్మో ఇంత ఫాస్ట్ ఏంటి అనుకుంటాడేమో..అడక్కపోతే మిస్ అయ్యేలా ఉన్నాడు.ప్చ్..
ఊర్లోనే ఉంటాడా..మనకు తెలిసిన ఫ్రెండ్స్ కి ఎవరికైనా వీడు కూడా తెలుసేమో కనుక్కుంటే పోలా… అదిరిపోలా అయిడియా..ఏదో వంక చెప్పి ఫలానా వాడు తెలుసా అని కనుక్కుంటే సరి.. మనం చూసిన గ్రీకు వీరుడు ఏ అమ్మాయితో మాట్లాడినా తప్పే..ఛల్ పోనీ అని మనసుకు నచ్చచెప్పుకోవడం..ఆ అమ్మాయి వాడి ఫ్రెండ్ అని తెలిస్తే హమ్మయ్యా అని ఊపిరిపీల్చుకోవడం.. ప్రతిరోజు బాగా రెడీ అయితా ,టైం బ్యాడ్ కాకపోతే నేను మంచిగా రెడీ కానీ రోజే వీడు కనపడాలా.. ఛీ ఛీ.. చూసి నవ్వుదామా..తిరిగి నవ్వుతాడా ,పాపం పిచ్చిది అనుకుంటాడా..ఎందుకొచ్చింది..చూడగానే నవ్వడం,హాయ్ చెప్పడం చేస్తే ఒవర్ అనుకుంటాడేమో.. మెల్లిగా లాక్కొద్దాం బండి..
సేకరణ: సోషల్ మీడియా..