రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ తెలుసు కదా. ఆమె గురించి తెలియని వారుండరు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ ఐపీఎల్ జట్టు ఓనర్‌గా ఆమె చాలా మందికి తెలుసు. ముంబై ఇండియన్స్ ఆడే అన్ని మ్యాచ్‌లకు వెళ్లి ఆమె టీం సభ్యులకు సపోర్ట్ చేస్తారు. అయితే కేవలం ఆ జట్టు మాత్రమే కాదు, ఆమె రిలయన్స్ గ్రూప్‌లో అనేక బాధ్యతలను మోస్తారు. కొన్నివేల కోట్ల రూపాయల సంపాదనను ఆర్జిస్తారు. అయితే మీకు తెలుసా..? అంత ధనవంతురాలైన ఆమె నిత్య జీవితంలో వాడే వస్తువుల ధర ఎంత ఉంటుందో..? అవును, వాటి గురించి ఎవరూ అంచనా వేయలేరు కూడా.
నీతా అంబానీ నిత్యం టీ తాగే కప్ప ధర ఎంత ఉంటుందో తెలుసా..? అక్షరాలా రూ.3 లక్షలు. అవును, అంత ఖరీదైన కప్పులోనే ఆమె టీ తాగుతారు. ఇక ఆ కప్పులను జపాన్ కు చెందిన నోరిటెక్ అనే కంపెనీ తయారు చేస్తుంది. ఆ కప్పులు 50 కలిపి సెట్‌గా వస్తాయి. ఆ సెట్ ఖరీదు రూ.1.50 కోట్ల వరకు ఉంటుంది. ఇక ఖరీదైన వాచ్‌లు అంటే ఆమెకు చాలా ఇష్టమట. దీంతో ఆమె ఎక్కువగా Bulgari, Cartier, Rado, Gucci, Calvin Klein, Fossil వంటి ప్రముఖ కంపెనీలకు చెందిన వాచ్‌లను వాడతారామె.
ఇక నీతా అంబానీ షూస్ కూడా ఖరీదైనవే వాడుతారు. Padro, Garcia, Jimmy Choo, Pelmodha, Marlin వంటి కంపెనీలకు చెందిన షూస్‌ను ఆమె వాడుతారట. వాటిని ఒకసారి వేస్తే ఇక మళ్లీ వేయరట ఆమె. ప్రపంచంలోనే చాలా ఖరీదైన హ్యాండ్ బ్యాగులను నీతా అంబానీ వాడుతారు. Snel, Goyard, Jimmy Choo కంపెనీలకు చెందిన హ్యాండ్ బ్యాగులను ఆమె వాడుతారు. వాటి ఖరీదు లక్షల్లో ఉంటుందట. అవును మరి, అంత ధనవంతులు అంతటి ఖరీదైన వస్తువులు వాడకపోతే ఇంకేం వాడుతారు. అయినా టీ కప్పుకు అంత ఖరీదా.. అందులో ఎవరు తాగినా టీయే కదా. వాచ్‌లో ఎవరికైనా కనిపించేది అదే టైం. మరి అంత ఖరీదనవి ఎందుకు..? అయినా మనకెందుకులే.. ఎవరెంతటి ఖరీదైన వస్తువులు వాడితే..!