‘మనిషి చనిపోయినా అతని ఆత్మ చావదు. మోక్షం లభించేంత వరకు ఆ ఆత్మ ఇతర శరీరాల్లో ప్రవేశిస్తూ, బయటికి వెళ్తూ, మళ్లీ లోపలికి ప్రవేశిస్తూ ఉంటుంది. అలా మోక్షం లభించాలంటే మానవుడు ఎల్లప్పుడూ మంచి పనులే చేయాలి. చెడు చేయకూడదు.’ అని హిందూ పురాణమైన భగవద్గీతలో ఉంది. కురుక్షేత్ర సంగ్రామం జరిగిన సమయంలో శ్రీకృష్ణుడు భగవద్గీతను అర్జునుడికి ఉపదేశిస్తాడు. దీంతో సత్యం తెలుసుకున్న అర్జునుడు యుద్ధం చేసి అందులో విజయం సాధిస్తాడు. అయితే భగవద్గీతలో పైన చెప్పిన ఆ విషయమే కాదు. మనిషి పుట్టుకకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. అదేమిటంటే…
సృష్టిలో కేవలం మనుషులే కాదు ప్రాణం ఉన్న జీవాలు ఎన్నో ఉన్నాయి. జంతువులు, పక్షులు, కీటకాలు, క్రిములు, సరీసృపాలు, మొక్కలు, వృక్షాలు… రకరకాల జీవాలు ఉన్నాయి. సైన్స్ పరంగా చెప్పాలంటే ఆ జీవాల సంఖ్య దాదాపుగా 8.7 మిలియన్ల (8.70 కోట్లు) వరకు ఉంటుందని అంచనా. వాటిలో 9 లక్షల రకాల జలచరాలు, 20 లక్షల రకాల మొక్కలు, వృక్షాలు, 11 లక్షల కీటకాలు, పురుగులు, 10 లక్షల రకాల పక్షులు, 30 లక్షల రకాల జంతువులు, 40 లక్షల రకాల మనుషులు ఉన్నారట. సాక్షాత్తూ సైంటిస్టులే ఈ విషయాన్ని చెబుతున్నారు. కాగా భగవద్గీత కూడా సృష్టిలో ఉన్న జీవాల సంఖ్య ఇంతే అని చెబుతోంది. దాని ప్రకారమైతే ప్రపంచంలో 8.40 కోట్ల ప్రాణి కోటి ఉందట. కాగా ఈ ప్రాణికోటిలో ఉన్న జీవాల రకాల ప్రకారం ఒక జీవి మనిషి జన్మ ఎత్తాలంటే 8.40 కోట్ల ప్రాణుల్లా ముందు జీవించాల్సి ఉంటుందట. ఆ తరువాతే ఏ జీవికైనా మనిషి జన్మ వస్తుందట. భగవద్గీతలోనే దీని గురించి చెప్పారు.
‘ఎన్నో నీచమైన జన్మల తరువాతే మనిషి జన్మ ప్రాప్తిస్తుంది’ అనే సామెత కూడా మన తెలుగులో ప్రచారంలో ఉంది. దీని గురించి చాలా మంది వినే ఉంటారు. పైన చెప్పిన జీవక్రమాన్ని అనుసరించే ఈ సామెత కూడా పుట్టుకువచ్చిందని పండితులు చెబుతున్నారు. అయితే ఏ జీవి అయినా మనిషిగా జన్మ ఎత్తాక అన్నీ మంచి పనులే చేయాలట. లేదంటే వారికి మోక్షం లభించక వారు చనిపోయినా ఇతరుల శరీరాల్లోకి ప్రవేశించి మళ్లీ జీవితం ప్రారంభిస్తారట. అలా ఆత్మకు మోక్షం దక్కే వరకు అలాగే జరుగుతూ ఉంటుందట. మనిషి పుట్టుక కచ్చితంగా ఎలా ప్రారంభమైందో తెలియకపోయినా భగవద్గీతను అనుసరించి చూస్తే పైన చెప్పినట్టుగానే మనిషి ఆయా జీవాలుగా ముందు జన్మించిన తరువాతే మానవునిగా జన్మిస్తాడట. అంటే జంతువుల నుంచే మనిషి వచ్చాడన్న మాట నిజమే కదా! మన సైంటిస్టులు కూడా దాదాపుగా ఇదే విషయాన్ని చెబుతున్నారు కదా!