Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

అల్యూమినియం ఫాయిల్స్ చుట్ట‌బ‌డిన ఆహారం తింటున్నారా..? అయితే జాగ్ర‌త్త‌..! వాటితో అనారోగ్యాలు వ‌స్తాయ‌ట‌..!

Admin by Admin
February 4, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

బేక‌రీ ఉత్ప‌త్తులు, చికెన్ క‌బాబ్స్‌, లెగ్ పీస్‌లు, తందూరీ రోటీ త‌దిత‌ర ఆహార ప‌దార్థాలను మీరెప్పుడైనా తిన్నారా? తిన‌కేం! అవంటే మాకెంతో ఇష్టం అంటారా! అది స‌రేలే గానీ, ఆయా ఆహార ప‌దార్థాల‌ను చుట్టి ఉంచే ఓ వెండి కాగితం లాంటిదాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా? ఆ, అదేనండీ దాన్నే అల్యూమినియం ఫాయిల్ అంటారు. అల్యూమినియం లోహాన్ని కొన్ని ప్ర‌త్యేక ప‌ద్ధ‌తుల్లో ప్రాసెసింగ్ చేయ‌డం ద్వారా ఆ ఫాయిల్‌ను త‌యారు చేస్తారు. ఇప్ప‌డీ మ‌ధ్య ఎక్క‌డ చూసినా ఈ ఫాయిల్ వాడ‌కం ఎక్కువైపోయింది కూడా. అయితే ఏంటంటారా? అక్క‌డికే వ‌స్తున్నాం. ఆ అల్యూమినియం ఫాయిల్ చుట్ట‌బ‌డి ఉన్న ఆహారాన్ని తింటే మ‌న ఆరోగ్యానికి ప్ర‌మాదం క‌లుగుతుంద‌ట‌. అవును, మీరు విన్న‌ది నిజ‌మే.

యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్‌, ఈజిప్ట్ దేశాల‌కు చెందిన కొంత మంది సైంటిస్టులు అల్యూమినియం ఫాయిల్ చుట్ట‌బ‌డి ఉన్న కొన్ని ఆహార ప‌దార్థాల‌పై ల్యాబొరేట‌రీలో క్షుణ్ణంగా ప్ర‌యోగాలు చేశారు. చివ‌రికి తెలిసిందేమిటంటే అల్యూమినియం ఫాయిల్‌ను ఆహార ప‌దార్థాల‌కు చుట్ట‌డం వ‌ల్ల దాంట్లో నుంచి కొన్ని అల్యూమినియం అణువులు స్వ‌ల్ప మోతాదులో ఆహారంలో క‌లుస్తున్నాయ‌ట‌. దీంతో ఆ ఆహారాన్ని తిన్న మ‌న‌కు వివిధ ర‌కాల అనారోగ్యాలు వ‌స్తున్నాయ‌ట‌. ప్ర‌ధానంగా అల్జీమ‌ర్స్‌, ఎముక‌ల సంబంధ వ్యాధులు, మూత్ర‌శాయ అనారోగ్యాలు, మెద‌డు క‌ణాల ప‌నితీరు దెబ్బ‌తిన‌డం వంటి వ్యాధులు వ‌స్తున్నాయ‌ట‌. అల్యూమినియం ఫాయిల్స్‌పై ఆ సైంటిస్టులు చేసిన ప్రయోగానికి సంబంధించిన రుజువుల‌ను ఇంట‌ర్నేష‌న‌ల్ జ‌ర్న‌ల్ ఆఫ్ ఎల‌క్ట్రోకెమిక‌ల్ సైన్స్‌లో కూడా ప్ర‌చురించార‌ట‌.

food served in aluminium foil is very dangerous to health

అల్యూమినియం ఫాయిల్స్‌ను ఎక్కువ‌గా వాడితే పైన చెప్పిన వ్యాధులు దీర్ఘ‌కాలంలో వ‌స్తాయ‌ట‌. ఈ క్ర‌మంలో అల్యూమినియం ఫాయిల్స్ చుట్టిన ఆహారాన్ని తిన‌క‌పోవ‌డ‌మే ఉత్త‌మ‌మ‌ని వైద్యులు కూడా చెబుతున్నారు. అల్యూమినియం ఫాయిల్స్‌కు బ‌దులుగా పింగాణీ, సెరామిక్ వంటి వ‌స్తువులలో ఆహారాన్ని పెట్ట‌వ‌చ్చ‌ని, వాటితో ఎలాంటి ప్ర‌మాదం లేద‌ని సైంటిస్టులు చెబుతున్నారు. కాబ‌ట్టి అల్యూమినియం ఫాయిల్స్ ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండ‌డం మ‌రిచిపోకండి. ఈ మ‌ధ్య కాలంలో ఇలాంటి వార్త‌లు ఎక్కువ‌గా తెలుస్తున్న క్ర‌మంలో మ‌నం మ‌న ఆరోగ్యం ప‌ట్ల క‌చ్చితంగా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిందే. మొన్నా న‌డుమ మ్యాగీ నూడుల్స్‌, నిన్న బ్రెడ్‌, ఇప్పుడు అల్యూమినియం ఫాయిల్… ఇంకా ఇలాంటివి ఎన్ని తెలుసుకోవాల్సి వ‌స్తుందో క‌దా!

Tags: aluminum foils
Previous Post

థియేటర్లోకి రాకముందే పైరసీ భారిన పడ్డ సినిమాలు ఏంటంటే..?

Next Post

మీకు తెలియ‌ని 7 సీక్రెట్స్.!!

Related Posts

వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025
హెల్త్ టిప్స్

రాత్రి పూట ఇలా చేస్తే ప‌డుకున్న వెంట‌నే నిద్ర ప‌ట్టేస్తుంది..!

July 4, 2025
వైద్య విజ్ఞానం

భార‌తీయ మ‌హిళ‌ల్లో పెరుగుతున్న గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్‌.. ఈ ల‌క్ష‌ణాలు ఉంటే జాగ్ర‌త్త‌..!

July 4, 2025
వైద్య విజ్ఞానం

మీకు డ‌యాబెటిస్ ఉందా..? అయితే మీ చ‌ర్మం ఆరోగ్యం ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే..!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.