Health Tips : అధిక బరువును తగ్గించుకోవడం అన్నది ప్రస్తుత తరుణంలో చాలా మందికి సవాల్‌గా మారింది. చాలా మంది అధికంగా ఉన్న బరువును తగ్గించుకునేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రోజూ ఉదయాన్నే కింద తెలిపిన విధంగా ఓ డ్రింక్‌ను తీసుకుంటే బరువును త్వరగా తగ్గించుకోవచ్చు. దాన్ని ఎలా తయారు చేయాలంటే..
ఒక కీరదోసను తీసుకుని దాన్ని కట్ చేసి కొన్ని ముక్కలు సేకరించాలి. అలాగే పుదీనా ఆకులను శుభ్రంగా కడిగి వాటిని కట్ చేసి గుప్పెడు మోతాదులో తీసుకోవాలి. అనంతరం ఒక గ్లాస్ లో నీటిని తీసుకుని అందులో ముందుగా కట్ చేసి పెట్టిన కీరదోస ముక్కలు, పుదీనా ఆకులను వేయాలి. రాత్రంతా ఆ నీటిని అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయం పరగడుపునే ఆ నీటిని తాగాలి. ఇలా రోజూ చేస్తూ ఉంటే అధిక బరువు తగ్గుతారు.
కీరదోసలో అధిక భాగం నీరే ఉంటుంది. అలాగే కీరదోస వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకుపోయి డిటాక్స్ అవుతుంది. ఇక పుదీనా జీర్ణ సమస్యలను తగ్గించడంతోపాటు మెటబాలిజంను పెంచుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫలితంగా కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. ఈ క్రమంలనే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కూడా కరుగుతుంది.
అయితే ఈ డ్రింక్‌ను కొద్దిగా ఎక్కువ మొత్తంలో తయారు చేసుకుని మధ్యాహ్నం సమయంలోనూ తాగవచ్చు. మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత 1 గంట వ్యవధి ఇచ్చి ఈ నీళ్లను తాగాలి. దీంతో శరీరంలోని వ్యర్థాలు ఎప్పటికప్పుడు బయటకు పోతాయి. బరువు తగ్గే ప్రక్రియ వేగవంతం అవుతుంది.