హిందూ సాంప్రదాయంలో బొట్టు పెట్టుకోవడం తప్పనిసరి. అసలు ఎందుకు బొట్టు పెట్టుకుంటారు అనేది చాలా మందికి తెలియదు. నుదుటి భాగానికి అంగారకుడు అధిపతి, అంగారకుడిని అగ్ని దేవుడని పిలుస్తారు. అగ్ని రూపాన్ని సింధూర వర్ణంతో పోలుస్తూ ఉంటారు. కాబట్టి నుదిటి మీద ఎర్రని బొట్టు పెట్టుకోవడం అనేది ఆచారంగా మారింది. బొట్టు ఎర్రదనం గా తెల్లటి విభూదిని పూస్తే అగ్ని మాదిరి కనబడుతుంది.
విభూతిని అందుకే మూడు వేళ్ళతో రాసుకుంటారు. కాబట్టి మనకు మూడు గీత మాదిరిగా కనబడుతుంది. దీనిని శివతత్వం గా పిలుస్తారు. ఇది పురాతన విధానంగా భావిస్తూ ఉంటారు. దీన్నే శివ తత్వం అని కూడా పిలుస్తారు. ఇది పురాతన విధానం. వైష్ణవ మొదలైన అనంతరం శివ మరియు వైష్ణవ తత్వాలను తేడా కోసం మూడు వేళ్ళతో అడ్డంగా విభూతి పూయడం మాని, నిలువుగా పెట్టుకోవడం మొదలుపెట్టారు.
దాని మీద ఎర్రటి జ్యోతి వెలిగించినప్పుడు బొట్టు పెట్టుకోవడం మొదలుపెట్టారు. వైష్ణవంలో వర్గాలు ఏర్పడిన అనంతరం ఒక వర్గం వారు తెల్లటి ప్రమిదలో జ్యోతి వెలిగించినప్పుడు బొట్టు పెట్టుకోవడం తప్పనిసరి. మరికొందరు ఎర్రటి జ్యోతి మాదిరి పెట్టుకోవడం జరుగుతుంది. ఎవరు ఏవిధంగా పొత్తు పెట్టుకున్నా సరే అగ్నిదేవుడి రంగు జ్యోతి ప్రజ్వలన చేస్తూ అంగారకున్ని గౌరవించడంలో మాత్రం మార్పు రాలేదు. నుదుట బొట్టు పెట్టుకునే ప్రాంతాన్ని జ్ఞాననేత్రం లేదా మనో నేత్రం అని పిలుస్తారు.