ట్రెయిన్ ఎయిర్ బ్రేక్ సిస్టమ్ తో పని చేస్తుంది. బ్రేక్ వేయాలంటే డ్రైవరు ఇంజన్ లో ఎయిర్ ప్రెషర్ తగ్గిస్తాడు. తిరిగి బ్రేక్ రిలీజ్ చేయాలంటే ప్రెషర్ పెంచుతాడు. ఇంజన్ నుండి ఎయిర్ పైపు అన్ని రైలు పెట్టెలకు కలిపి వుంటుంది. రైలు పెట్టె లో అమర్చిన అలారం చైను లాగినప్పుడు పెట్టెకు ఒక చివర End Body కి fix చేసిన valve డిస్క్ ఆపరేట్ చేయబడుతుంది. ఈ వాల్వ్ ట్రెయిన్ బ్రేకింగ్ సిస్టమ్ కి కలిపి ఉంటుంది.
ఎప్పుడైతే అలారం ఛైను లాగుతామో అప్పుడు పెట్టె చివర fix చేసిన valve open అయ్యి ఆ valve ద్వారా ఎయిర్ బయటకు లీకేజ్ అవుతుంది. ఎయిర్ లీకేజి మూలంగా ఇంజన్ లో ఉన్న ఎయిర్ కంప్రెసర్ ఎక్కువ ఎయిర్ ను పంప్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఎక్కువ ఎయిర్ ఫ్లో అవుతుందో అప్పుడు ఇంజన్ క్యాబిన్ లో వున్న ఎయిర్ ఫ్లో ఇండికేటర్ షూట్ అప్ అవుతుంది. దీనిని గమనించి డ్రైవరు ఎవరో అలారం చైను లాగినట్లుగా గుర్తిస్తాడు.
అప్పుడు డ్రైవరు రెండు షార్ట్ ఒక లాంగ్ హార్న్ వేస్తాడు. ఇలా చేస్తే ట్రైనులో ఉన్న రైల్వే సిబ్బంది మరియు ట్రైను గార్డు ఎవరో అలారం చైన్ లాగినట్లుగా అప్రమత్తం అవతారు. ఇంజన్ నుండి అసిస్టెంట్ డ్రైవరు, అలాగే వెనక కోచ్ నుండి గార్డు ఒకక పెట్టే చూసుకుంటూ వస్తారు.
ఎయిర్ ప్రెషర్ 5 కేజీల వరకు వుంటుంది కావున ఏ పెట్టే దగ్గర ఎయిర్ లీకేజ్ అవుతుందో అక్కడ హిస్సింగ్ శబ్దం వస్తుంది. ఆ హిస్సింగ్ శబ్దం బట్టి ఆ పెట్టెలో చైన్ లాగినట్లుగా గుర్తిస్తారు. వాల్వ్ కి అమర్చిన చైన్ ద్వారా ఓపెన్ ఆయిన డిస్క్ ని రీసెట్ చేస్తారు.