2000 దశకం వరకూ కూడా సినిమా అనేది కళాత్మక వ్యాపారం అనేవారు.. కానీ నేడది ఫక్తు వ్యాపారంగా మారిపోయింది ఆ తర్వాత.. ఇక సినిమా నిర్మాణం చేయాలంటే నిర్మాత ఎక్కువగా ఫైనాన్షియర్ మీద ఆధారపడతారు.. అది ఎంత పెద్ద చిత్ర నిర్మాణ సంస్థ అయినా సరే , నిర్మాత పెట్టుబడి కోసం ఫైనాన్షియర్ దగ్గరకి వెళ్లాల్సిందే.. ఉదాహరణకు సూపర్ స్టార్ రజినీకాంత్ చంద్రముఖి సినిమా అనుకున్న వెంటనే, ఒక సాధారణ వ్యక్తిని సినిమా నిర్మాతగా ప్రకటించారు.. వెంటనే ఫైనాన్షియర్లు ఆ సదరు నిర్మాత ముందు గుమ్మరించారు అని చెప్తారు.. అయితే ఇక్కడ ఒక లొసుగు ఉంది, సినిమాలకి ఫైనాన్స్ చేసేవాళ్ళు దారుణమైన వడ్డీ తీసుకుంటారు అని చెప్తారు.. ఆ వడ్డీ నూటికి రూ. 5 నుంచి రూ. 10 వరకూ ఉంటుంది..
ఇక హీరో, హీరోయిన్ రెమ్యూనరేషన్లు, దర్శకుడి రెమ్యూనరేషన్లు పోగా, నిర్మాణ వ్యయం హీరో స్థాయిని బట్టి సులువుగా రూ. 40 కోట్ల నుంచి రూ. 100 కోట్ల వరకూ వెళ్లిపోయింది (ఇవి సాధారణ సినిమాలు, బాహుబలి లాంటి భారీ స్థాయి సినిమాల ప్రస్తావన ఇక్కడ తీసుకురావడం లేదు) సరే ఇంత ఖర్చుపెట్టి సినిమా తీసి ప్లాప్ అయిందంటే, ఇక నిర్మాత పని అయిపోయినట్టే.. భారీ వడ్డీ తో తీసుకున్న అప్పు తిరిగి కట్టాల్సి ఉంటుంది.. ఆలా ఒక్క సినిమా ప్లాప్ తో ఇంక సినిమాలకి ఒక దండం పెట్టేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు మన టాలీవుడ్ లో.. వారిలో కొంతమంది.. దేవి వర ప్రసాద్ : ఈయన చిరంజీవి , బాలకృష్ణ గారితో హిట్లు ఇచ్చారు.. కానీ 2001 లో వచ్చిన మృగరాజు పరాజయంతో ఈయన చిత్ర పరిశ్రమకి దూరమైపోయారు..
చెంగల వెంకట్రావు : సమరసింహారెడ్డి లాంటి భారీ హిట్ కొట్టారు, కానీ నరసింహుడు ప్లాప్ అయ్యాక ట్యాంక్ బండ్ ఎక్కి దూకేస్తాను అని అయన చేసిన రచ్చ ఇప్పటికీ మరచిపోలేము.. అశ్విని దత్ : 70 ల్లో పెద్ద ఎన్టీఆర్ గారితో మొదలుపెట్టి, దాదాపుగా టాలీవుడ్ లోని అగ్ర హీరోలు అందరితో హిట్లు కొట్టిన అశ్విని దత్ గారు కూడా శక్తి సినిమా తర్వాత పరిశ్రమకు దూరమయ్యారు.. ఆ సినిమా కోసం ఆయన సొంత ఆస్తులు కూడా కొన్ని అమ్ముకున్నట్లు అప్పట్లో చెప్పేవారు.. ఇప్పుడు వారి కుమార్తెలు మాత్రమే సినిమాలు నిర్మిస్తున్నారు..
ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి, రెండూ కాదు, పెద్ద పుస్తకమే రాయొచ్చు.. ఎవరో చెప్పినట్టు ఒక్క శుక్రవారం సినిమా నిర్మాతని కుబేరుడు గా మార్చగలదు, లేదంటే కుచేలుడుగా కూడా మార్చగలదు.. అంతా విధి విలాసం, ప్రేక్షక దేవుళ్ళ అనుగ్రహం..