దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుత్రికగా గతంలో వైకాపా తరఫున షర్మిళ ప్రచారం చేశారు. తరువాత అన్నా చెల్లెళ్లకు పడకపోవడంతో షర్మిల తెలంగాణకు వచ్చారు. కానీ కొంత కాలానికే పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్‌లో కొనసాగుతూ అన్నకు కొరకరాని కొయ్యగా మారారు షర్మిల. గత ఎన్నికల్లో ఆమె చీల్చిన ఓట్ల వల్లే జగన్ ఓడారని అంటుంటారు. అయితే వాస్తవానికి వైఎస్ కుటుంబమే ఒక డ్రామా కుటుంబమని కూడా కొందరు అంటారు. వాళ్ల మధ్య ఒక అవగాహన ఉంటుందట.
మాజీ సీఎం జగన్ ఇప్పటికే తన చెల్లెలికి ఇవ్వాల్సిన ఆస్తులన్నీ ఇచ్చేశారట. ఆస్తి పంపకాలు ఎప్పుడో జరిగిపోయాయట. ఈ క్రమంలోనే వారి తల్లి తమ ఇద్దరు బిడ్డల్లో ఎవరికి ప్రచారం చేయాలో తెలియక సతమతమవుతున్నారు. కొడుకును అవుననలేకపోతున్నారు. అటు కుమార్తెకు ఫుల్ సపోర్ట్ ఇవ్వలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఆమె యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరంగా వెళ్లిపోయారు.
ఎన్నికలు అయ్యాక కొడుకు ఓడిపోయాక అమ్మయ్య ప్రమాదం తప్పింది లేకపోతే నా భర్త వైఎస్ఆర్ పోయినట్టే నేను పోయేదాన్ని అని విజయమ్మ ఇండియాకి వచ్చినట్లు విశ్లేషకులు అంటున్నారు. అవినాష్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి, షర్మిల కి ఒక ఒప్పందం కుదిరిందట. ఆమె డబ్బులు ఆమెకి ఇచ్చేసి స్వతంత్రంగా ఆమె అవినాష్ రెడ్డి మీద పోటీ చేయాలి ఆ రకంగా టిడిపి, వైసిపి, షర్మిల ముక్కోణపు పోటీ జరగాలని, ప్రతిపక్ష ఓట్లు చీలిపోయి షర్మిలకి పడాలనేది పథకమట. అందుకే షర్మిలకు లక్ష అరవై వేల ఓట్లు వచ్చాయని చెబుతారు. అయితే వారు అనుకున్నది నెరవేరలేదు. కాంగ్రెస్ పార్టీని ఏపీ ప్రజలు అసలు నమ్మలేదు. అందుకే ఇలా జరిగింది. లేకపోతే జగనే మళ్లీ సీఎం అయ్యే వారని అంటుంటారు.