Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home mythology

మ‌హాభార‌తంలో అర్జునుడికి తెలిసిన ఈ విద్య గురించి మీరు విన్నారా..?

Admin by Admin
March 20, 2025
in mythology, వార్త‌లు
Share on FacebookShare on Twitter

భారత యుద్ధం అంటే ఆద్యంతం ఆసక్తి. అందులో కథానాయకుడు అంటే అర్జునుడుగానే చెప్పవచ్చు. అయితే ఆయన అలా కావడానికి పలు కారణాలు ఉన్నాయి. సాక్షాత్తు నర, నారాయణలలో విష్ణువు అంశతో శ్రీకృష్ణుడు అయితే న‌ర అంశతో జన్మించినది అర్జునుడు. ధర్మసంరక్షణకు ఆయా దివ్యపురుషులు అర్జునుడికి రకరకాల శక్తులను ధారపోశారు. అటువంటి దివ్యశక్తుల్లో ఒకటైన ప్రతిస్మృతి మహావిద్యను ఆయనకు ఉపదేశించింది ఎవరో తెలుసుకుందాం… దుర్యోధనాదులను యుద్ధంలో ఎదుర్కోవడం కష్టమని తలచి తలచి అలసిన ధర్మరాజును సమీపించాడు వ్యాసుడు. పాండవులు అతని రాకకు ఎంతగానో ఆనందించారు. యథోచితంగా గౌరవించారు. ఇష్టాగోష్ఠి జరిగిన అనంతరం ఆ మహాముని ధర్మజునికి ఈ విధంగా ఉపదేశించాడు. భీష్మ ద్రోణ కృపాచార్యులు, రాధేయుడు అజేయులని నీవు కలవర పడుతున్నావు. అది గ్రహించే నేను నీ దగ్గరకు వచ్చాను. నీకిప్పుడు నేనో మహామంత్ర విద్య అనుగ్రహిస్తాను. దానిని నువ్వు తిరిగి సవ్యసాచికి ఉపదేశించు.

ఆ మంత్ర ప్రభావంతో అర్జునునికి అభీష్ట సిద్ధి కలుగుతుంది అని వ్యాసుడు ప్రతిస్మృతి పేరున ప్రసిద్ధమైన ఒకానొక దివ్యమంత్ర విద్యను ధర్మపుత్రునికి కటాక్షించాడు.నాయనా! ఈ మంత్రాన్ని నువ్వు అర్జునునికి ఉపదేశిస్తే దీంతో ఆ శూరుని పరాక్రమ ప్రాభవం, తపశ్శక్తి పూర్వం కన్నా వేయింతలు అధికమవుతుంది. అంతేకాదు, ఈ మంత్ర ప్రభావం వల్ల అర్జునుడు, ఇంద్రుడు, యముడు, వరుణుడు మొదలయిన దిక్పాలకులనేగాక, ఆ పార్వతీపతిని కూడా సాక్షాత్కరింపజేసుకుని వారి అనుగ్రహం వల్ల దివ్యాస్ర్తాలను ఎన్నటినో సంపాదించి భవిష్యత్తులో పగవారిని అవలీలగా నిర్జిస్తాడు అని వ్యాసుడు వెళ్లిపోయాడు.

do you know that arjuna knows this astram

ఒకానొక రోజున అర్జునుని చేర పిలిచి దేవేంద్రనందనా! ధనుర్వేదం భీష్మ ద్రోణ కృప కర్ణాశ్వత్థామల భుజస్కంధాలను ఆశ్రయించి ఉన్నది. అందువల్లనే దుర్యోధనుడు వారిని అనుక్షణం ఆదరిస్తున్నాడు. రణరంగంలో వారిని ఎదుర్కొవడం మనవల్ల కాదు. అయితే మనం వారినే ముందుగా ఎదుర్కోవాలి. ఇదెలా సాధ్యం అనుకుంటున్న తరుణంలో వ్యాసులవారు నన్ను కరుణించి నాకో మహా మంత్రవిద్య ఉపదేశించారు. దాని పేరు ప్రతిస్మృతి. దానిని నీకు నేను ఉపదేశిస్తాను. నువ్వది స్వీకరించి కవచం, ఖడ్గం, కార్ముకం ధరించి ఉత్తర దిశాభిముఖుడివై ప్రయాణం చెయ్యి.

ఈ మంత్ర ప్రభావంతో యాత్రాకాలంలో ఎంతటి వీరాధివీరులయినా నిన్ను ఎదుర్కొనలేరు. నిన్ను ఓడించలేరు.. అంటాడు. ధర్మరాజు ప్రతిస్మృతి మంత్ర విద్యను అర్జునునికి ఉపదేశించాడు. అదండి సంగతి వ్యాసుడు ధర్మరాజుకు ఉపదేశిస్తే, అర్జునుడికి ప్రతిస్మృతి మహావిద్యను ధర్మరాజు ఉపదేశించాడు. ఇది మహాభారత యుద్ధంలో విజయంలో కీలక పాత్ర పోషించింది.

Tags: Arjuna
Previous Post

బిలంలో ఉండే ఈ ఆల‌యాన్ని ద‌ర్శించుకుంటే.. కోరిన కోరిక‌లు నెర‌వేరుతాయ‌ట‌..!

Next Post

కుక్క‌లు త‌ర‌చూ ఎందుకు ఏడుస్తాయి..? దీని వ‌ల్ల ఇంట్లోని వారికి ఏదైనా కీడు జ‌రుగుతుందా..?

Related Posts

lifestyle

ఒంటరిగా ఉన్నప్పుడు నా భార్య ఫోర్స్ చేస్తోంది.. అలా ఉందామంటూ..!!

July 5, 2025
వినోదం

సర్కారు వారి పాటలో ఈ మిస్టేక్ ను గమనించారా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అబ్బా!

July 5, 2025
వినోదం

శ్రీమంతుడు నుంచి బలగం కథలు దొంగలించారంటూ..! వివాదాస్పదంగా నిలిచిన 10 సినిమాలు ఇవేనా ?

July 5, 2025
ఆధ్యాత్మికం

వెంక‌టేశ్వ‌ర స్వామికి శ‌నివారం అంటే ఎందుకు అంత ఇష్టం..?

July 5, 2025
ఆధ్యాత్మికం

ఇంటి ప్ర‌ధాన ద్వారానికి మామిడి ఆకుల తోర‌ణాల‌నే ఎందుకు క‌డ‌తారు..?

July 5, 2025
ఆధ్యాత్మికం

ఆల‌యాల్లో గంట‌ను ఎందుకు కొడ‌తారు..? దీని వ‌ల్ల ఉప‌యోగం ఏమిటి..?

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.