Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వైద్య విజ్ఞానం

న‌డుము నొప్పి అస‌లు ఎలా వ‌స్తుంది..? అందుకు కార‌ణాలు ఏమిటి..?

Admin by Admin
March 22, 2025
in వైద్య విజ్ఞానం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఈ రోజుల్లో యుక్త వయసు వారి నుంచి వయో వృద్ధుల వరకు అందరికీ ఉన్న ప్రధాన సమస్య నడుం నొప్పి. సాధారణంగా నడుం నొప్పి రెండు రకాలు.. మొదటిది అక్యుట్ లో బ్యాక్‌ పెయిన్‌. రెండవది క్రానిక్ లో బ్యాక్‌ పెయిన్‌. ఈ నొప్పి రావడానికి కారణం అనేకం. మనిషిని బట్టి.. వయసుని బట్టి.. పరిస్థితులను బట్టి నడుం నొప్పి తీవ్రత మారుతుంది. ప్రపంచ వ్యాప్తంగా, మనిషి వైకల్యానికి ఇది రెండో సాధారణ కారణం. సాధారణంగా నడుం నొప్పి మూడు నెలల కన్నా ఎక్కువ కాలం ఉంటే, దానిని దీర్ఘకాలిక నడుం నొప్పి అంటారు. ఈ సమస్య చాలా మందికి వస్తుంది. వయసు పెరుగుతున్న కొద్దీ తీవ్రత పెరుగుతుంది. వ్యక్తి జీవన విధానం మీద, వృత్తి, ఉద్యోగాల మీదా తీవ్ర ప్రభావం చూపుతుంది.

యాక్సిడెంట్స్‌, వెన్నుపూసకు గాయాలు, ఫ్రాక్చర్స్‌, ప్రమాదాల్లో బలమైన దెబ్బ తగిలినప్పుడు శరీర కండరాలు దెబ్బతింటాయి. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల్లో.. వెన్నుపూస ఎముకలు విరగడం, వెన్ను మధ్యలోని జెల్‌ లాంటి డిస్కు బయటకు రావడం కూడా జరుగుతుంది. ఈ సమస్యతో బాధపడుతున్నవారికి విపరీతమైన నొప్పి వేధిస్తుంది. కాళ్లు కదల్చలేకపోవడం కూడా ఉంటుంది. వయసు పెరిగే కొద్ది కండరాలపై భారం పెరుగుతుంది. దీర్ఘకాలంగా బరువైన పనులు చేసే కూలీలకు, శ్రామికులకు వెన్నుపూస, డిస్క్‌ అరిగే అవకాశం ఎక్కువ. దీనివల్ల కూడా నడుం నొప్పి వస్తుంది.

why back pain comes what are the reasons

వెన్నుపూస ఎముకలకు క్షయ సోకి, చీము పడుతుంది. దీనివల్ల వెన్నుపూస ఎముకలు అరగడం, దెబ్బతినడం వంటివి జరుగుతాయి. క్యాన్సర్‌ వెన్నుపూసకు సోకితే, వెన్నుపూస ఎముకలు ఫ్రాక్చర్‌ అవుతాయి. మానసికంగా ఒత్తిడికి గురైతే ఆ ప్రభావం వెన్నుపై పడుతుంది. ఈ నొప్పి నడుంపై పడుతుంది. తీవ్రమైన నడుం నొప్పి దీని లక్షణం. నడుం నొప్పికి చాలా కారణాలు ఉంటాయి. దాన్ని బట్టి చికిత్స‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. అసలు సమస్యను కనిపెట్టి, దానికి తగిన ట్రీట్‌మెంట్‌ ఇచ్చినట్లయితే నొప్పిని చాలా వరకూ తగ్గించవచ్చు. కన్జర్వేటివ్‌ థెరపీ, సర్జికల్‌ ట్రీట్‌మెంట్‌, సైకలాజికల్‌ ట్రీట్‌మెంట్‌, బెడ్‌ రెస్ట్‌.. సమస్యను తీవ్రతను బట్టి వైద్యులు వీటిని సూచిస్తుంటారు.

Tags: back pain
Previous Post

ఏయే న‌వ గ్ర‌హానికి ఏ మంత్రాన్ని ప‌ఠిస్తే మంచి జ‌రుగుతుందంటే..?

Next Post

సామ‌లు తిన‌డం వ‌ల్ల ఎన్ని అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

Related Posts

lifestyle

ఒంటరిగా ఉన్నప్పుడు నా భార్య ఫోర్స్ చేస్తోంది.. అలా ఉందామంటూ..!!

July 5, 2025
వినోదం

సర్కారు వారి పాటలో ఈ మిస్టేక్ ను గమనించారా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అబ్బా!

July 5, 2025
వినోదం

శ్రీమంతుడు నుంచి బలగం కథలు దొంగలించారంటూ..! వివాదాస్పదంగా నిలిచిన 10 సినిమాలు ఇవేనా ?

July 5, 2025
ఆధ్యాత్మికం

వెంక‌టేశ్వ‌ర స్వామికి శ‌నివారం అంటే ఎందుకు అంత ఇష్టం..?

July 5, 2025
ఆధ్యాత్మికం

ఇంటి ప్ర‌ధాన ద్వారానికి మామిడి ఆకుల తోర‌ణాల‌నే ఎందుకు క‌డ‌తారు..?

July 5, 2025
ఆధ్యాత్మికం

ఆల‌యాల్లో గంట‌ను ఎందుకు కొడ‌తారు..? దీని వ‌ల్ల ఉప‌యోగం ఏమిటి..?

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.