Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

ఎంత‌టి ఓర్చుకోలేని బాధ‌లు ఉన్నా.. ఈ ఆల‌యాన్ని ద‌ర్శిస్తే చాలు..

Admin by Admin
March 24, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుని ఆలయం అంటే తిరుపతే గుర్తుకువస్తుంది. ఇక్కడ సకల భోగాలూ అనుభవించే వేంకటేశ్వరుని బైరాగిగా ఊహించుకోగలమా! కానీ కర్ణాటకలోని ఓ ప్రదేశంలో శ్రీనివాసుడు అలాగే కనిపిస్తారట. ఇంతకీ ఆ ప్రదేశం ఎక్కడ ఉంది. అక్కడి స్వామి ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం… కర్ణాటకలోని శ్రీరంగపట్నం శివారు ప్రాంతంలో మైసూరు హైవే పక్కన ఓ కొండ కనిపిస్తుంది. రెండువేల అడుగులకు పైనే ఎత్తు ఉండే ఈ కొండ మీద ఉన్న ఆలయం గురించే మనం చెప్పుకొంటున్నది. ఈ కొండని కరిఘట్ట అని పిలుస్తారు. కరి అంటే నలుపు అన్న అర్థం ఉంది కాబట్టి నల్లటి కొండ అన్న ఊహతో ఆ పేరు పెట్టి ఉండవచ్చు. కరి అంటే ఏనుగు అన్న అర్థం కూడా ఉంది కదా! ఈ కొండ మీద ఏనుగులు తినే గడ్డి బాగా ఎదిగి కనిపిస్తుంది. అందుకనే ఏనుగుకొండ అన్న ఆలోచనతోనూ ఆ పేరు పెట్టి ఉండవచ్చు.

కరిఘట్ట మీద ఉన్న ఆలయం ఈనాటిది కాదు. వరాహపురాణంలో సైతం దీని ప్రస్తావన ఉంది. ఇక్కడి కొండ మీద కనిపించే దర్భలు సాక్షాత్తు ఆ వరాహస్వామి శరీరం నుంచి ఉద్భవించాయని అందులో పేర్కొన్నారు. అప్పట్లో ఈ కొండను నీలాచలం అని పిలిచేవారట. మన తిరుపతిలో కనిపించే ఏడుకొండలలో ఒకటైన నీలాద్రిలోని కొంతభాగమే ఈ నీలాచలం అని అంటారు. ఇక్కడి మూలవిరాట్టుని వైకుంఠ శ్రీనివాసుడు లేదా కరిగిరివాసుడు అని పిలుస్తారు. ఆరడుగుల నల్లని రాతిలో కనిపించే ఈ మూలవిరాట్టుని సాక్షాత్తు ఆ భృగు మహర్షి ప్రతిష్టించాడని చెబుతారు. ఈ స్వామికి అలంకారం చేసినప్పుడు, బైరాగిలా అగుపిస్తాడట. అందుకనే బైరాగి వెంకటరమణుడు అని కూడా పిలుచుకుంటారు. పేరుకి బైరాగే కానీ ఈ స్వామిని కొలిస్తే ఎలాంటి కష్టమైనా తీరిపోతుందని భక్తుల నమ్మకం. జీవితంలో ఓర్చుకోలేని బాధలు వచ్చినప్పుడు, ఇక్కడ పూజలు నిర్వహిస్తే తప్పక ఫలితం దక్కుతుందట. కరిఘట్ట ఆలయానికి చేరుకునేందుకు 400కు పైగా మెట్లు ఎక్కాల్సి ఉంటుంది.

karighatta temple important facts to know

అలా ఎక్కలేనివారు వాహనాల్లో చేరుకునేందుకూ రహదారి ఉంది. కొండ పక్కనే కావేరి ఉపనది అయిన లోకపావని ప్రవహిస్తూ ఉంటుంది. ఈ కొండ మీదకు ఎక్కినవారికి కరిగిరివాసుని దర్శనం ఎలాగూ దక్కుతుంది. దానికి తోడుగా లోకపావనికి ఆవలి ఒడ్డున ఉండే నిమిషాంబ ఆలయం, శ్రీరంగపట్నంలోని రంగనాథస్వామి ఆలయాలు కూడా కనిపిస్తాయి. వీటితో పాటు మైసూరు, శ్రీరంగపట్నం, చాముండి హిల్స్ కూడా కనువిందుచేస్తాయి. మైసురు నుంచి శ్రీరంగపట్నానికి వెళ్లే యాత్రికులు తప్పకుండా ఈ కరిఘట్ట ఆలయాన్ని కూడా సందర్శిస్తారు. చింత, ఉసిరి, కొబ్బరిచెట్లతో ఆహ్లాదకరమైన ఆ కొండ ప్రదేశం అహ్లాదంగా ఉంటుంది.

Tags: karighatta temple
Previous Post

శ్రీ‌కృష్ణున్ని అస‌లు గోవిందుడు అని ఎందుకు పిలుస్తారు..?

Next Post

శ్రీ వెంక‌టేశ్వ‌రుని రూపం గురించి ఈ విష‌యాలు తెలుసా..?

Related Posts

lifestyle

కేజీ ప‌ల్లీల ధ‌ర రూ.180, ప‌ల్లి నూనెను కేజీకి రూ.150కి ఎలా అమ్ముతున్నారు..?

July 1, 2025
Home Tips

మీ ఫ్రిజ్ నుంచి దుర్వాస‌న వ‌స్తుందా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

July 1, 2025
ఆధ్యాత్మికం

మీకు ఇలాంటి క‌ల‌లు వ‌స్తున్నాయా..? అయితే మీ స‌మస్య‌లు త్వ‌ర‌లో పోతాయ‌ని అర్థం..!

July 1, 2025
పోష‌ణ‌

ఈ ఒక్కటి తింటే చాలు ఈ కాలంలో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..!!

July 1, 2025
technology

WI-FI రూటర్ వేగానికి చిన్న ట్రిక్స్.. రెప్పపాటులో హెచ్‌డీ వీడియోలు డౌన్‌లోడ్

July 1, 2025
హెల్త్ టిప్స్

మద్యం సేవిస్తున్న సాయంలో పొరపాటున కూడా తినకూడని 5 పదార్థాలు ! మీ ఆరోగ్యానికే ముప్పు జాగ్రత్త !

July 1, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.