భారతీయులలో నగరాలలో నివసించే వారిలో ప్రతి అయిదుగురిలో ఒకరికి షుగర్ వ్యాధి, రక్తపోటు వున్నట్లు తాజా నివేదికలు తెలుపుతున్నాయి. ప్రత్యేకించి మహారాష్ట్ర లో దీని ప్రభావం మరింత ఆందోళన కలిగించేదిగా వుంది. అక్కడి నగర వాసులలో ప్రతి ముగ్గురిలో ఒకరికి ఈ రెండు వ్యాధులు వున్నట్లు వెల్లడయింది.
ఈ సర్వే స్క్రీనింగ్ ఇండియాస్ ట్విన్ ఎపిడమిక్ అనే పధకంలో చేశారు. దేశం మొత్తంగా చూస్తే 60 శాతమని, మహారాష్ట్రలో ఈ జంట వ్యాధుల ప్రభావం 67 శాతంగా కూడా వుందని సర్వేలో తేలింది.ఈ పరిశోధనలో సుమారు 16,000 మందిని నగరాలలో వున్నవారిని 8 రాష్ట్రాలలో మూడు సంవత్సరాలపాటు అధ్యయనం చేశారు.
ఈ వ్యాధులు రెండూ నియంత్రణ లేనివిగా వున్నాయని, ప్రజలు వారి షుగర్ స్ధాయిలను స్వయంగా నియంత్రించుకోవడం లేదని పరిశోధనా టీముకు నాయకత్వం వహించిన డా. శశాంక్ తెలిపారు. ఈ రెండు వ్యాధులూ నియంత్రణ లేకుండా పెరిగిపోవటానికి అధిక బరువు, మాంసాహారం తినటం కారణాలుగా వారు పేర్కొన్నారు.