డార్క్ చాక్లెట్ సాధారణ పాలు అంత రుచికరం కాదు కానీ, దానిలో అనేక ఆరోగ్య రహస్యాలు దాగున్నాయి. సాధారణంగా ఏ చాక్లెట్ తిన్నా బాగుంటుంది. డార్క్ చాక్లెట్ రుచి అధికంగా దానిలో కోకో కలపటం వలన వచ్చింది. గుండెకు మంచిది – ఈ స్పెషల్ చాక్లెట్ లో యాంటీ ఆక్సిడెంట్లుగా పని చేసే ఫ్లేవనాయిడ్లు వుంటాయి. ఇవి శరీరానికి హాని కలిగిచే ఫ్రీ ర్యాడికల్స్ అనే రసాయనాలనుండి కాపాడతాయి. ఇది కొల్లెస్టరాల్, అధిక రక్తపోట్లను కూడా అరికడుతుంది.
ఆనందం పెంచుతుంది – బ్రెయిన్ లో ఆనందాన్ని కలిగించే ఎండోర్ఫిన్లను రిలీస్ చేస్తుంది. మైండ్ రిలాక్స్ చేసి యాంటీ డిప్రెసంట్ గా పనిచేస్తుంది. రుతుక్రమ దశలో మహిళలు డల్ గా వుంటారు కనుక ఈ చాక్లెట్ తింటే మూడ్ మారుతుంది.షుగర్ తక్కువగా వుండటంతో కొద్దిపాటి చేదు వున్నప్పటికి షుగర్ వ్యాధి వున్నవారికి ఇది తినేందుకు ఆరోగ్యమే.
అల్జీమర్స్, గుండె వ్యాధులు గల వారికి కూడా ఇది ఆరోగ్యకరమైనదే. చాకోతో అందం పెరుగుతుంది – జర్మన్ రీసెర్చర్ల మేరకు, ఈ చాక్లెట్ ను స్కిన్ కేర్ లో కూడా ఉపయోగిస్తారు. చాక్లెట్ లోని ఫ్లేవనాయిడ్లు అల్ట్రా వయలెట్ రేడియేషన్ నుండి చర్మాన్ని రక్షిస్తాయి. బ్లడ్ సర్కులేషన్ పెరిగి ముఖ కాంతి బాగుంటుంది. సెలబ్రిటీల ముఖ కాంతికి ఈ చాక్లెట్ తినటం గొప్ప రహస్యమంటారు.