ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఒకటి లేదా రెండు కప్పులు కాఫీ సేవిస్తే, అది డయాబెటిస్ నియంత్రణకు సహకరిస్తుందని పరిశోధనలు తెలుపుతున్నాయి. కాఫీ తాగటానికి, డయాబెటీస్ వ్యాధికి మధ్య గల సంబంధాన్ని పరిశోధిస్తూ ఇప్పటికి 15 స్టడీలు ప్రచురించబడ్డాయి. వీటిలో చాలావరకు కాఫీ లోని యాంటీ ఆక్సిడెంట్లు డయాబెటీస్ వ్యాధి నియంత్రణకు తోడ్పడతాయని తేలింది.
కాఫీలో కేఫైన్ తొలగించి తాగినప్పటికి దాని ప్రభావం డయాబెటీస్ పై అదే రకంగా వుందని హర్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ రీసెర్చర్ ఫ్రాంక్ హు వెల్లడించారు. కాఫీలోని యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, మెగ్నీషియం, క్రోమియం మొదలైనవి ఇన్సులిన్ ఉపయోగానికి తోడ్పడతాయన్నారు.
టైప్ 2 డయాబెటీస్ తో గుండె సంబంధిత వ్యాధులు, పక్షవాతాలు కూడా వచ్చే అవకాశముందని, అయితే కాఫీ లోని పదార్ధాలకు గుండె సంబంధిత వ్యాధులు పురుషులలోను, స్త్రీలలోను తగ్గించేటందుకు తోడ్పడతాయని తెలిపారు. ఈ పరిశోధనలో సుమారు 130,000 రోగులను పరీక్షించారు. రోజుకు 1 నుండి 3 కప్పులవరకు కాఫీ తాగిన వారు 20 శాతం తక్కువగా హాస్పిటల్ పాలైనట్లు ఆయన తెలిపారు.