Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home Off Beat

పారాషూట్ కొబ్బరి నూనె గురించి ఈ షాకింగ్ నిజం మీకు తెలుసా.? హెయిర్ ఆయిల్ అనుకోని వాడుతున్నాము కానీ.!

Admin by Admin
May 27, 2025
in Off Beat, వార్త‌లు
Share on FacebookShare on Twitter

పారాచూట్ కొకొన‌ట్ ఆయిల్ తెలుసు క‌దా. మనం చిన్న‌ప్ప‌టి నుంచి దాన్ని మ‌న జుట్టుకు వాడుతూ వ‌స్తున్నాం. చ‌లికాలంలో అయితే అందులో ఉండే నూనె గ‌డ్డ క‌ట్టుకుపోతుంది. దీంతో దాన్ని వేడి చేసి రాసుకునేవారం గుర్తుందా. అయితే ఇప్ప‌టికీ అనేక మంది ఈ ఆయిల్‌ను జుట్టుకు వాడుతున్నారు లెండి. అది వేరే విష‌యం. మార్కెట్‌లోకి ఎన్ని కొత్త హెయిర్ ఆయిల్స్ వ‌చ్చినా పారాచూట్ ఆయిల్‌ను మాత్రం చాలా మంది ఇప్ప‌టికీ వాడుతూనే ఉన్నారు. అయితే ఈ ఆయిల్ గురించి మీకో విష‌యం తెలుసా..? నిజానికి మ‌నం ఈ ఆయిల్‌ను హెయిర్ ఆయిల్‌లా వాడుతున్నాం కానీ, పారాచూట్ కొకొన‌ట్ ఆయిల్ హెయిర్ ఆయిల్ కాద‌ట‌. అవును మీరు విన్న‌ది నిజ‌మే. అది కుకింగ్ ఆయిల్ అట‌. అవును, సాక్షాత్తూ దాన్ని త‌యారు చేసే కంపెనీయే ఆ మాట చెబుతోంది.

పారాచూట్ కొకొన‌ట్ ఆయిల్ హెయిర్ ఆయిల్ కాదు. అది కుకింగ్ ఆయిల్‌. కావాలంటే దాని ప్యాకింగ్‌పై ఎక్క‌డ చూసినా కొకొన‌ట్ ఆయిల్ అని ఉంటుంది కానీ… హెయిర్ ఆయిల్ అని ఉండ‌దు కదా. చూశారు క‌దా. అంతే కాదు, ఆ ఆయిల్ కుకింగ్ ఆయిల్ అని చెప్పి దాన్ని త‌యారు చేసే మ‌రికో అనే కంపెనీ వాదిస్తూ ప్ర‌భుత్వానికి ట్యాక్స్ ఎగ్గొడుతోంది. ఎందుకంటే.. కుకింగ్ ఆయిల్స్ పై ఎక్సైజ్ సుంకం ఉండ‌దు. కాస్మొటిక్స్‌లో ఒక భాగ‌మైన హెయిర్ ఆయిల్స్‌పైనే ఈ సుంకం ఉంటుంది. క‌నుక మ‌రికో అనే కంపెనీ ఏం చేస్తుందంటే.. త‌న పారాచూట్ కొకొన‌ట్ ఆయిల్‌ను కుకింగ్ ఆయిల్ అని చెబుతోంది. అందుకే దాని ప్యాక్‌పై కూడా ఎక్క‌డా హెయిర్ ఆయిల్ అని ముద్రించ‌లేదు. అయితే దీన్ని మాత్రం ఆ కంపెనీ హెయిర్ ఆయిల్‌గానే యాడ్స్‌లో ప్రచారం చేసుకుంటోంది. కాగా దీనిపై ప్ర‌భుత్వం కోర్టుకెక్కింది.

do you know this fact about parachute coconut oil

స‌ద‌రు మ‌రికో కంపెనీ త‌యారు చేస్తున్న పారాచూట్ కొకొన‌ట్ ఆయిల్ కుకింగ్ ఆయిల్ కాద‌ని, హెయిర్ ఆయిలేన‌ని, క‌నుక దానిపై ట్యాక్స్ వేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోర్టును ప్ర‌భుత్వం కోరింది. అయితే కోర్టు ఇందుకు వివ‌ర‌ణ అడ‌గ్గా సద‌రు మ‌రికో కంపెనీ త‌న వాద‌న వినిపించింది. తాము త‌యారు చేస్తున్న పారాచూట్ కొకొన‌ట్ ఆయిల్ కుకింగ్ ఆయిల్ అని, హెయిర్ ఆయిల్ కాద‌ని, దానిపై ఎక్క‌డా హెయిర్ ఆయిల్ అని వేయ‌లేద‌ని, కావాలంటే అది చూసుకోవ‌చ్చ‌ని మ‌రికో వాదిస్తోంది. అయితే మ‌రి 200 ఎంఎల్ క‌న్నా త‌క్కువ మొత్తంలో ప్యాక్‌ల‌ను శాషేలుగా ఎందుకు అందిస్తున్నార‌ని కేంద్రం అడ‌గ్గా, అందుకు మ‌రికో స్పందిస్తూ.. స‌ద‌రు శాషేలు పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాలు, విద్యార్థుల‌ను ఉద్దేశించి త‌యారు చేసిన‌వ‌ని, వారు ఆయిల్‌ను త‌క్కువగా వంట‌ల్లో వాడుతారు క‌దా, క‌నుక వారికి భారీ ప్యాకెట్లు అవ‌స‌రం లేద‌ని, చిన్న ప్యాకెట్లు చాల‌ని, అందుకే వాటిని అలా చిన్న ప్యాక్‌ల‌లో త‌యారు చేస్తామ‌ని మ‌రికో చెప్పింది.

కానీ.. చెప్పేవి శ్రీ‌రంగ నీతులు.. అన్న‌ట్టుగా ఆ కంపెనీ మాత్రం మ‌న‌కు యాడ్‌ల‌లో పారాచూట్ కొకొన‌ట్ ఆయిల్‌ను హెయిర్ ఆయిల్ అనే చూపిస్తుంది క‌దా. ఇదంతా ఓ జిమ్మిక్కు మ‌రి. ట్యాక్స్ ఎగ్గొట్టేందుకు కొత్త ప్లాన్‌. అయినా ఏం చేస్తాం. ఇలాంటి లొసుగులు ఉండ‌బ‌ట్టే క‌దా ఎంతో మంది, ఎన్నో కంపెనీలు ట్యాక్స్ ల‌ను ఎగ్గొడుతున్నది. వీటికి ట్యాక్స్‌లు ప‌డేలా చ‌ట్టాల‌ను మార్పు చేస్తే త‌ప్ప ఇలాంటి ఘ‌ట‌న‌లు ఆగ‌వు. ఏం చేస్తాం.. అంతా.. మ‌న ప్ర‌భుత్వాల ఖ‌ర్మ మ‌రి..!

Tags: parachute coconut oil
Previous Post

కొబ్బ‌రికాయకు నిజంగా లావాను ఆప‌గ‌లిగే శ‌క్తి ఉందా..? అవునో, కాదో తెలియాలంటే ఈ ప్ర‌యోగాన్ని చూడాల్సిందే..!

Next Post

కాఫీ, టీ తాగే ముందు మనలో చాలా మంది నీళ్లు తాగుతారు. ఇది మంచిదా? కాదా?

Related Posts

హెల్త్ టిప్స్

ఏ సీజ‌న్‌లో అయినా స‌రే కొబ్బ‌రి నీళ్ల‌ను రోజూ తాగాల్సిందే.. ఎందుకంటే..?

June 1, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మీరు పోష‌కాహార లోపంతో బాధ‌ప‌డుతున్నారా.. అయితే గుండె పోటు వ‌స్తుంద‌ట‌..

June 1, 2025
వైద్య విజ్ఞానం

ఈ ఆహారాల‌ను మీరు క‌డుపు నిండా తిన‌వ‌చ్చు.. కానీ బ‌రువు మాత్రం పెర‌గ‌రు..

June 1, 2025
వినోదం

స్కూల్ ఫీజ్ క‌ట్ట‌లేక…కార్పెంట‌ర్ ప‌నిలో చేరిన దాస‌రి ! ద‌ర్శ‌క‌ర‌త్న గురించి మ‌న‌కు తెలియ‌ని కోణం.!!

June 1, 2025
information

ఎస్‌బీఐ లోగోను అలా ఎందుకు డిజైన్ చేశారో తెలుసా.? వెనకున్న కారణం, దాగున్న అర్థం ఇదే..!

June 1, 2025
ఆధ్యాత్మికం

ఏయే దానాలు చేయ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయంటే..? అద్భుత‌మైన స‌మాచారం మీ కోసం..

June 1, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!