అనుష్క అసలు పేరు స్వీటి శెట్టి..తన తొలి సినిమా సూపర్ టైంలో పూరి జగన్నాధ్ స్వీటి పేరుని మార్చి అనుష్క అని పెట్టారు.ఆ తర్వాత అనుష్క ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయిందో అందరికి తెలిసిందే.ఇప్పటికి సినిమాల్లో తప్ప అందరూ అనుష్కను స్వీటి అనే పిలుస్తారు..సినిమాల్లో పేర్లు మార్చుకోవడం కొత్తేం కాదు.ఎందరో హీరోహీరోయిన్లు పేరు మార్చుకున్నవారున్నారు. ఇండస్ట్రీ లోకి వచ్చిన తరువాత వారికి ఉన్న పేరుతో అంతకు ముందే నటీనటులు ఉన్నా లేదా దర్శకుడు, నిర్మాతలకు వారి పేర్లు మార్చాలనిపించినా వారి అసలు పేరు మారిపోతుంది..లేదంటే సినిమాల్లో పాపులారిటి రావడంకోసం జ్యోతిష్యపరంగా పేర్లు మార్చుకునేవారు కొందరుంటారు..పేరు మారిన హీరోయిన్లెవరో చూడండి.
సహజనటిగా పేరుగాంచిన జయసుధ అసలు పేరు సుజాత.ఆమె పుట్టింది మద్రాసులో.జయసుధ సినిమాల్లోకి అడుగుపెట్టే సమయానికి మరో సుజాత ఉండటంతో జయసుధగా పేరు మార్చోకోవాల్సి వచ్చింది. జయప్రద అసలు పేరు లలితా రాణి. రాజమండ్రిలో జన్మించిన ఈమె చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయమై, దక్షిణాది, బాలివుడ్ లో అగ్రకథానాయికగా ఎదిగి, ఆ తరువాత రాజకీయాల్లో స్థిరపడిపోయింది. శ్రీ అమ్మ అయ్యంగార్ అయ్యప్పన్ అంటే ఆ అని నోరెళ్లబెడతాం అదే శ్రీదేవి అని చెప్తే వావ్ అంటాం..అతిలోక సుందరి అసలు పేరు శ్రీ అమ్మ అయ్యంగార్ అయ్యప్పన్ .. పుట్టింది తమిళనాట అయినా, సెటిల్ అయింది ముంబైలో.చైల్డ్ ఆర్టిస్టు నుండి బాలివుడ్ సూపర్ స్టార్ గా ఎదిగిన ఆమె మరణంతో భారతీయ చిత్ర పరిశ్రమ ఎంతలా శోకించిందో తెలుసుకదా..
తెలుగు సినిమా ఉన్నంత కాలం సౌందర్య అనే పేరుకి చావు లేదు. భౌతికంగా మనల్ని విడిచివెళ్ళిన ఈ మహానటి అసలు పేరు సౌమ్య.సౌందర్య పుట్టింది కర్ణాటకలో.చిన్నవయసులో విమాన ప్రమాధంలో మరణించి అభిమానులను శోక సంద్రంలో ముంచేసింది.తెలుగు పరిశ్రమలో సౌందర్య స్థానాన్ని ఎవరూ భర్తీచేయలేరన్నది నిజం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనాత్మక పేరుగా మారిన రోజా అసలు పేరు శ్రీలత రెడ్డి. సినిమాల కోసం రోజాగా మారింది. గ్లామర్ అనే పదం వినగానే 1990ల ప్రేక్షకులకి గుర్తొచ్చే పేరు రంభ.రంభ అసలు పేరు విజయలక్ష్మీ. పుట్టింది విజయవాడలో..సినిమాల్లోకి వచ్చాక రంభగా మారింది. ఇటు గ్లామర్ రోల్స్ తో, అటు వైవిధ్యమైన నటనతో తెలుగు ప్రేక్షకులని అలరించిన రాశి అసలు పేరు మంత్ర. ఇప్పుడు కూడా ఆమెని ఈ పేరుతోనే పిలుస్తారు. కేరళ అందం నయనతార అసలు పేరు డయాన మరియమ్ కురియన్. కాని ఈ లేడి సూపర్ స్టార్ గ్లామర్ ప్రపంచంలోకి రాగానే నయనతారగా మారింది.బాగా ఫేమస్ అయింది.
దేశ రాజధాని ఢిల్లీ నుంచి వచ్చిన రచన చావ్లా కాస్త భూమికగా మారి, పవన్ కళ్యాణ్ తో ఖుషి, మహేష్ బాబుతో ఒక్కడు, ఎన్టీఆర్ తో సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది.ఇప్పుడు వదిన పాత్రలో కూడా ప్రేక్షకులను మెప్పించింది. స్నేహ అసలు పేరు సుహాసినీ రాజారాం నాయుడు.స్నేహ సినిమాల్లోకి అడుగుపెట్టకముందే మనకు సుహాసిని అనే హీరోయిన్ ఉంది.దాంతో స్నేహ హీరోయిన్ అయ్యాక పేరు మార్చుకోక తప్పలేదు. 90వ దశకంలో జగపతిబాబు, శ్రీకాంత్ హీరోలుగా వచ్చిన ఫ్యామిలీ ఎంటర్ టైనింగ్ సినిమాల్లో తనదైన శైలిలో రాణించిన ఆమని అసలు పేరు మీనాక్షి.. నటిగానే కాకుండా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలిగానూ ఓ వెలుగు వెలిగిన నగ్మ అసలు పేరు నందితా అరవింద్..మాష్టార్ సినిమాలో నటించిన రోషిణి,సూర్య భార్య జ్యోతిక..ముగ్గురు అక్కాచెళ్లెల్లు.
అందం అభినయంతో తాను చేసిన ప్రతి సినిమాలోనూ తన ముద్ర చూపించే టబు అసలు పేరు తబస్సుం హష్మి. కొన్నేళ్ల క్రితం వరకు తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా వెలుగొందిన సిమ్రాన్ అసలు పేరు రిషిబాల.తెలుగులో టాప్ హీరోలందరి సరసన నటించింది.తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయింది.సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటికి అంతగా పేరు రాకపోవడంతో మళ్లీ సినిమాల్లో కనిపించలేదు. కమల్ హాసన్ కూతురిగానే కాకుండా తనదైన నటనతో తెలుగులో రాణిస్తున్న శృతి అసలు పేరు రాజ్యలక్ష్మి.మొదట్లో ఐరన్ లెగ్ అనే ముద్ర పడినా రాను రాను స్టార్ హీరోయిన్ గా స్థానం సంపాదించుకుంది.