ప్రపంచంలో ఉన్న మనుషులందరిలో బాగా తెలివైనవారు కొందరుంటారు. అలాగే కొంచెం తెలివైన వారు కూడా ఉంటారు. వీరితోపాటు తెలివి అస్సలు లేని వారూ ఉంటారు. అయితే కొందరికి పుట్టుకతోనే అమితమైన తెలివితేటలు వస్తాయి. కొందరికి అవి పెరుగుతున్న కొద్దీ వస్తాయి. ఇక తెలివి తేటల విషయంలో ఎవరు ఎలా ఉన్నా రాత్రి పూట పుట్టిన వారు మాత్రం సహజంగానే ఇతర సమయాల్లో పుట్టిన వారి కంటే ఎక్కువ తెలివి తేటలను కలిగి ఉంటారట తెలుసా..? అవును, మీరు విన్నది నిజమే. ఇది మేం చెబుతున్నది కాదు. పలువురు సైంటిస్టులు చెబుతున్న నిజం.
యూనివర్సిటీ ఆఫ్ మాడ్రిడ్‌కు చెందిన పలువురు సైంటిస్టులు కొందరిపై ప్రయోగాలు చేశారు. వ్యక్తులను వారు పుట్టిన సమయాలను అడిగి తెలుసుకున్నారు. దీంతోపాటు వారి విజ్ఞానం, చదువు, తెలివితేటలు, ఐక్యూ స్థాయిలను కూడా పరిశీలించారు. దీంతో వారు చివరికి ఓ విషయం తేల్చేశారు. అదేమిటంటే… రోజులో మిగతా సమయాల్లో కన్నా రాత్రి పూట పుట్టిన వారే ఎక్కువ తెలివిమంతులు అవుతారట. వారికే ఐక్యూ ఎక్కువగా ఉంటుందట. దీంతోపాటు పలు ఇతర విషయాలను కూడా ఆ సైంటిస్టులు వెల్లడించారు.
రాత్రి పూట పుట్టిన వారికి తెలివి తేటలే కాదు, సమస్యలను పరిష్కరించే సత్తా కూడా ఉంటుందట. వీరు చదువుల్లో ఎక్కువగా రాణిస్తారట. గొప్ప ఉద్యోగాలు చేస్తారట. సాధారణంగా ఎవరికైనా రోజుకు కనీసం 7 నుంచి 9 గంటల నిద్ర కావాలి కదా. అయితే రాత్రి పూట పుట్టిన వారికి మాత్రం కేవలం 5 నుంచి 6 గంటల నిద్ర ఉన్నా సరిపోతుందట. వీరికి ఎక్కువ నిద్ర అవసరం ఉండదట. పనిలో బాగా చురుగ్గా ఉంటారట. ఎక్కువ పని చేస్తారట..!