కొంతమంది సెలిబ్రిటీలు, ప్రపంచ ప్రఖ్యాత బ్రిట్నీ స్పియర్స్ వంటి నటీమణులు అతి త్వరగా తమ బరువు తగ్గించేసి ఎంతో నాజూకుగా కనపడుతూంటారు. మరి వారి బరువు తగ్గటం వెనుక వున్నఆహార రహస్యాన్ని పరిశీలిద్దాం. వీరి ఆహారంలో బ్రౌన్ రైస్ తప్పక వుంటుంది. కొద్దిపాటి చికెన్, చేప కూడా చేరుస్తారు. తాజాపండ్లు, ప్రత్యేకించి ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చే అవకాడోవంటి పండ్లను తింటారు. బరువుతగ్గాలంటే జంక్ ఫుడ్ పక్కన పెట్టాల్సిందే. అయితే, టర్కీ బర్గర్ వంటి ఆరోగ్య తిండి తినవచ్చు.
బ్రిట్న స్పియర్ మరో ఆహార విధాన రహస్యం ఆమె కొద్ది కొద్ది ఆహారాన్ని తరచుగా తింటుంది. అందరిలా 3 ఎక్కువ భోజనాలు కాక అయిదు మార్లుగా తక్కువ తక్కువగా తింటుంది. వీరి భోజనంలో ప్రొటీన్ అధికంగా వుండే, గుడ్లు, చికెన్, టోఫు, సాల్మన్ చేప, పచ్చని కూరగాయలు తప్పక వుంటాయి. బరువు తగ్గాలనుకునే వీరు వెన్న తీసిన పాలు మాత్రమే తాగుతారు. ఆల్కహాలు వంటి పానీయాలు వదిలేసి ఆరోగ్యకరమైన పండ్లరసాలే తాగాలి.
బ్రిట్నీ స్పియర్ ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంది. అందువలన కూడా ఈమె బరువు త్వరగా తగ్గింది. బ్రిట్నీ స్పియర్ త్వరగా బరువు తగ్గటంలో వున్న రహస్యం ఆమె చేపట్టిన ఆహారా విధానం మాత్రమే. కనుక త్వరగా బరువు తగ్గాలనుకునేవారు తమ ఆహారంలో మార్పులు చేసుకుంటూ తగిన వ్యాయామం చేస్తే మంచి ఫలితాలు పొందుతారు.