గుండెకు బలమైన ఆహారాలు సాధారణంగా హాస్పిటల్స్ లో గుండె జబ్బుల రోగులకు సూచిస్తారు. అయితే ఈ ఆహారాన్ని మీ ఆరోగ్యకర ఆహార ప్రణాళికలో కూడా చేర్చుకోవచ్చు. ఈ ఆహారాలలో చాలావరకు ఆరోగ్యకరమైనవి, పోషకాలు బాగా కలిగిన ఆహారాలు మాత్రమే వుంటాయి. గుండెకు బలమైన ఆహారంలో పండ్లు, పచ్చటి కూరలు, తృణధాన్యాలు, పీచు పదార్ధాలు వుంటాయి. కొవ్వు, సోడియం, కొల్లెస్టరాల్, కేఫైన్ వంటి గుండె జబ్బులు కలిగించే పదార్ధాలు తక్కువగా వుంటాయి.
సాధారణంగా గుండె జబ్బు రోగులు ఎప్పటికపుడు ఆహార నిపుణుల పర్యవేక్షణలో వుండి వారి ఆహార ప్రణాళికలు మార్పులు చేసుకుంటారు. ఈ రోగులకు నేషనల్ కొల్లెస్టరాల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం మేరకు రోజుకు, పీచు 20 నుండి 30 గ్రాములు, కార్బోహైడ్రేట్లు 50 శాతం నుండి 60 శాతం వరకు కేలరీలు ఇచ్చేవిగాను కొవ్వు 25 నుండి 35 శాతం కేలరీలు, శాట్యురేటెడ్ కొవ్వు 7 శాతం కంటే తక్కువ కేలరీలు, మోనో అన్ శాట్యురేటెడ్ కొవ్వు 20 శాతం కంటే తక్కువ ఉండాలి.
పాలీ అన్ శాట్యురేటెడ్ కొవ్వులు 10 శాతం, కేలరీలకంటే తక్కువగాను వుండాలి. కొల్లెస్టరాల్ రోజుకు 200 మి.గ్రాములు మాత్రమే వుండాలి. సోడియం, లేదా కేఫైన్ రోజుకు సాధారణంగా 2,000 నుండి 4,000 మి.గ్రా.మాత్రమే వుండాలి. గుండెజబ్బు రోగుల ఆహారంలో కొన్ని ఆహారాలు నియంత్రించబడి ఆరోగ్యం, పోషకాలు అందించే ఆహారాలు చేర్చబడతాయి.