దీర్ఘకాలంపాటు షుగర్ నియంత్రణలో లేకుంటే శరీరంలోని వివిధ అవయావాలు దెబ్బ తింటాయి. వాటిలో కిడ్నీలు కూడా ఒకటి. కిడ్నీలపై షుగర్ ప్రభావించి అవి చెడిపోతే ఈ వ్యాధిని డయాబెటిక్ కిడ్నీ వ్యాధి అంటారు. షుగర్ కనుక సుమారు 15 సంవత్సరాలకు పైగా వుంటే ప్రతి 10 మంది షుగర్ రోగులలోను 4 గురికి ఈ వ్యాధి వస్తుంది. కిడ్నీలు తమ సామర్ధ్యం కోల్పోయి మూత్రాన్ని వడగట్టటంలో విఫలమవుతాయి.
రోగికి అలసట, వాంతులు, శ్వాస కష్టమవటం, రక్తపోటు వంటివి వస్తాయి. కిడ్నీ వ్యాధిని ముందుగా కనిపెట్టాలి. డాక్టర్లు, మూత్రంలో ప్రొటీన్ పోతోందా అనే దానికి టెస్టులు చేస్తారు. రక్తంలో షుగర్ స్ధాయి నియంత్రించటం, రక్తపోటు తగ్గించటం వంటివి కిడ్నీలు మరింత దెబ్బతినకుండా తోడ్పడతాయి. ఈ వ్యాధి అంతిమ దశలో రోగికి డయాలసిస్ లేదా కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ వంటివి మాత్రమే పరిష్కారంగా వుంటాయి.
కొన్ని సమయాలలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే పాన్ క్రియాస్ గ్రంధిని కూడా ట్రాన్స్ ప్లాంట్ చేయాల్సి వుంటుంది. ఈ వైద్య చికిత్స చాలా కష్టతరమైంది. కనుక షుగర్ వ్యాధి గ్రస్తులు, ఎప్పటికపుడు రక్తంలోని తమ షుగర్ స్ధాయిలను నియంత్రించుకుంటూ తగిన ఆహారాలు, వ్యాయామం, వైద్య పర్యవేక్షణ కలిగి వుండాలి.