ఆధునిక కాలంలో ఆయుష్షు తరిగిపోతోంది. కాలుష్యం, చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా 60 ఏళ్లకే ముసలివారైపోయి మరణిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఆయుష్షును పెంచే ఆయుధాలు మీ ఇంట్లోనే ఉన్నాయి. చెడు అలవాట్లను వదిలేసి మంచి అలవాట్లను పాటించడం ద్వారా మీరు ఆయుష్షును పెంచుకోవచ్చు. అలాగే ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవడం ద్వారా మీరు ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇంట్లో ఉన్న వస్తువులలో ఏమేమి మీ ఆయుష్షును పెంచుకోవడానికి ఉపయోగపడతాయి తెలుసుకోండి. మల్లె మొక్క ఇంట్లో ఉంటే ఎంతో మంచిది. ఇది ఇంట్లో అందంగా పెరగడమే కాదు.. మల్లె పువ్వులను పూసి మంచి సువాసన వేస్తుంది. ఆ సువాసన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. వాటి నుంచి వచ్చే వాసన నిద్రా స్థాయిలు మెరుగుపరుస్తుంది. నాణ్యత గల నిద్రపట్టేలా చేస్తుంది. ఆ సువాసన ప్రశాంతమైన మనసును అందిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. ఒత్తిడి లేని నిద్ర వల్ల ఆయుష్షు పెరుగుతుంది. మల్లెపూల నుంచి వచ్చే వాసన ఆందోళన, ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే గాలిని శుద్ధి చేస్తుంది. కాబట్టి ఇంట్లో కచ్చితంగా ఉండేలా చూసుకోండి.
చింతపండును ఉపయోగిస్తే మీ జుట్టును బలంగా మృదువుగా మార్చుకోవచ్చు. చింతపండు కణాల పెరుగుదలను, జుట్టు బలాన్ని ప్రోత్సహిస్తాయి. ఇవి మీకు ఆరోగ్యకరమైన అందమైన జుట్టును అందిస్తాయి. కలుషితమైన గాలి వల్ల మీ జుట్టు రాలకుండా కాపాడతాయి. దీనివల్ల జుట్టు మూలాలు బలపడతాయి. చింతపండు తలపై సెబమ్ ఉత్పత్తిని కూడా పెంచి చుండ్రును నివారిస్తుంది. దీనివల్ల మీకు జుట్టుకు సంబంధించిన సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. బీట్రూట్ చర్మానికి, ఆరోగ్యానికి జుట్టుకు అన్నింటికీ ప్రయోజనకారి. ఇది పోషకాల శక్తి కేంద్రంగా చెప్పుకోవచ్చు. బీట్రూట్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఇనుము అధికంగా ఉంటాయి. ఇది చర్మాన్ని డిటాక్సిఫికేషన్ చేస్తుంది. శరీరం నుండి మలినాలను వ్యర్ధాలను బయటికి పంపిస్తుంది. బీట్రూట్లోని ఇనుము జుట్టు రాలడాన్ని నియంత్రణలో ఉంచుతుంది. జుట్టుకు మెరుపు కనిపిస్తుంది. బీట్రూట్ ను తిన్నా ముఖానికి రాసుకున్నా తలకు పట్టిస్తే ఎంతో ఆరోగ్యం. ఎన్నో సమస్యలు రాకుండా ఇది అడ్డుకుంటుంది.
ప్రతిరోజు ఒక దానిమ్మ పండు తినేవారు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ఇది పోషకాలు నిండుగా ఉండే పండు. దీనిలో పీచు పదార్థం కూడా అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. దానిమ్మ పండ్లు కొవ్వును తగ్గిస్తాయి. జీవక్రియను పెంచుతాయి. దీనిలో ఉండే అదనపు పాలీఫెనాల్స్ మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఖనిజాలు సమృద్ధిగా ఉండే దానిమ్మలో ఫోలేట్ ,విటమిన్ ఎ, విటమిన్ ఈ, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలోని క్యాలరీలను బర్న్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు బరువు తగ్గుతారు. బరువు ఎప్పుడు తగ్గుతారో… అప్పుడు మీరు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల బారిన పడకుండా జాగ్రత్తగా ఉంటారు. ఇది మీ జ్ఞాపకశక్తిని కూడా పెంచుతుంది.
రోజుకు రెండు యాలకులు నోట్లో వేసుకొని నమలడం వల్ల మెదడుకు ఎంతో మంచిది. ఇది మెదడు కణాలను కాపాడడంలో ముందుంటుంది. యాంటీ బ్యాక్టీరియా లక్షణాలను ప్రదర్శిస్తుంది. రక్తపోటు నియంత్రిస్తుంది. బరువు తగ్గడానికి ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. ఒత్తిడి తగ్గించి నిద్రను మెరుగుపరుస్తుంది. రాత్రిపూట గోరువెచ్చని నీటిలో యాలకులు నానబెట్టి ఆ నీటిని తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిరోజు ఐదు జీడిపప్పులు తినడం అలవాటు చేసుకోండి. దీనిలో మోనోశాచురేటెడ్ కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. రక్తంలో ట్రైగ్లిజరైడ్లను తగ్గించడానికి సహాయపడతాయి. గుండె ఆరోగ్యంగా జీవించేందుకు సహాయపడతాయి. జీడిపప్పులో ఉండే మెగ్నీషియం ఎముకలను బలంగా మారుస్తుంది. ఒత్తిడి, ఆందోళన నిర్వహించడానికి సహాయపడుతుంది. జీడిపప్పు మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. అలాగే జీడిపప్పులో క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గించే గుణం కూడా ఉంది. కాబట్టి జీడిపప్పులు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.