Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home యోగా

Yoga : రోజూ 5 నిమిషాలు ఈ ఆస‌నం వేస్తే.. ఆస్త‌మా, సైన‌స్‌, థైరాయిడ్ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి..!

Editor by Editor
February 12, 2022
in యోగా, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Yoga : ఆస్త‌మా, సైన‌స్‌, థైరాయిడ్‌.. వంటి స‌మ‌స్య‌లు ప్ర‌స్తుతం చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయి. దీంతో అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. చ‌లికాలంలో వీరికి ఇంకా స‌మ‌స్య‌లు ఎక్కువ‌వుతాయి. అయితే యోగాలో ఈ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే ఆస‌నం ఒక‌టి ఉంది. అదే.. ఉష్ట్రాస‌నం. దీన్ని రోజూ వేయ‌డం వ‌ల్ల ఎలాంటి శ్వాస‌కోశ స‌మ‌స్య అయినా స‌రే త‌గ్గిపోతుంది. అలాగే థైరాయిడ్ గ్రంథులు బాగా ప‌నిచేస్తాయి. దీంతో థైరాయిడ్ స‌మ‌స్య నుంచి కూడా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఈ ఆస‌నాన్ని ఎలా వేయాలంటే..

do this Yoga Ustrasana daily for 5 minutes to get rid of asthma and thyroid
Yoga

ఉష్ట్రాస‌నం వేసే విధానం..

ముందుగా నేల‌పై మోకాళ్ల మీద కూర్చోవాలి. త‌రువాత వెన్నెముక‌ను నిటారుగా ఉంచి మోకాళ్ల మీదే ఉండి నిల‌బ‌డాలి. రెండు అర చేతుల‌ను వెనుక పిరుదుల‌పై ఉంచాలి. పిరుదుల‌పై ఉంచిన చేతుల స‌పోర్ట్‌తో వెన‌క్కి వంగాలి. ముఖంతో పైకి చూడాలి. త‌రువాత పిరుదుల‌పై ఉన్న చేతుల‌ను తీసేసి వాటితో రెండు పాదాల‌ను ప‌ట్టుకోవాలి. ఈ భంగిమలో 6 నుంచి 10 సెక‌న్ల పాటు సౌక‌ర్యంగా ఉన్నంత వ‌ర‌కు ఉండాలి. త‌రువాత మ‌ళ్లీ య‌థాస్థితికి రావాలి.

ఇలా ఉష్ట్రాస‌నాన్ని రోజూ క‌నీసం 5 నిమిషాల పాటు అయినా స‌రే చేయాలి. దీని వ‌ల్ల అనేక స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. ముఖ్యంగా ఆస్త‌మా, సైన‌స్ వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. అలాగే థైరాయిడ్ గ్రంథుల ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. థైరాయిడ్ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

ఈ ఆసనం వేయ‌డం వ‌ల్ల మెద‌డుకు ర‌క్త స‌ర‌ఫరా పెరుగుతుంది. దీంతో ముఖం కాంతివంతంగా మారుతుంది. కాళ్లు, తొడ‌లు, చేతులు, భుజాలు దృఢంగా మారుతాయి. గొంతు స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. అల‌ర్జీల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. గుండె, న‌డుం, ఛాతి, గ‌ర్భాశ‌యం దృఢంగా మారుతాయి. ఈ ఆస‌నాన్ని రోజూ వేయ‌డం వ‌ల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగు ప‌డుతుంది. ఊపిరితిత్తులు శుభ్రంగా మారుతాయి. ఇలా అనేక లాభాలు క‌లుగుతాయి. ఇక ఈ ఆస‌నాన్ని గ‌ర్భిణీలు వేయ‌రాదు.

Tags: asthmathyroidUstrasanayogaఆస్త‌మాఉష్ట్రాస‌నంథైరాయిడ్‌యోగా
Previous Post

IPL 2022 Auction : నేడు, రేపు ఐపీఎల్ 2022 మెగా వేలం.. ప్లేయ‌ర్లపై క‌న్నేసిన ఫ్రాంచైజీలు..

Next Post

Vitamin D : విట‌మిన్ డి ఎక్కువైతే అంతే సంగ‌తులు.. రోజుకు ఎంత విట‌మిన్ డి తీసుకోవాలో తెలుసా ?

Related Posts

హెల్త్ టిప్స్

ఏ సీజ‌న్‌లో అయినా స‌రే కొబ్బ‌రి నీళ్ల‌ను రోజూ తాగాల్సిందే.. ఎందుకంటే..?

June 1, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మీరు పోష‌కాహార లోపంతో బాధ‌ప‌డుతున్నారా.. అయితే గుండె పోటు వ‌స్తుంద‌ట‌..

June 1, 2025
వైద్య విజ్ఞానం

ఈ ఆహారాల‌ను మీరు క‌డుపు నిండా తిన‌వ‌చ్చు.. కానీ బ‌రువు మాత్రం పెర‌గ‌రు..

June 1, 2025
వినోదం

స్కూల్ ఫీజ్ క‌ట్ట‌లేక…కార్పెంట‌ర్ ప‌నిలో చేరిన దాస‌రి ! ద‌ర్శ‌క‌ర‌త్న గురించి మ‌న‌కు తెలియ‌ని కోణం.!!

June 1, 2025
information

ఎస్‌బీఐ లోగోను అలా ఎందుకు డిజైన్ చేశారో తెలుసా.? వెనకున్న కారణం, దాగున్న అర్థం ఇదే..!

June 1, 2025
ఆధ్యాత్మికం

ఏయే దానాలు చేయ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయంటే..? అద్భుత‌మైన స‌మాచారం మీ కోసం..

June 1, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!