Samantha : నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన తరువాత నుంచి సమంత ప్రతి విషయంలోనూ దూకుడుగా ప్రవర్తిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడంతోపాటు తరచూ వెకేషన్స్‌కు వెళ్తోంది. ఇక ప్రస్తుతం ఈమె యశోద అనే పాన్ ఇండియా లెవల్ మూవీలో నటిస్తోంది. ఇందులో నటి వరలక్ష్మి శరత్ కుమార్ కూడా కీలకపాత్రను పోషిస్తోంది. ఈ క్రమంలోనే సమంత, వరలక్ష్మి ఇద్దరూ ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కలసి కనిపిస్తున్నారు.
యశోద సినిమా షూటింగ్‌లో భాగంగా సమంత, వరలక్ష్మిలు కలసి కనిపిస్తున్నారు. ఈ మధ్యే వీరు పార్టీ చేసుకోగా.. అందులో సెలబ్రిటీ స్టైలిస్ట్ నీరజ కూడా కనిపించింది. ఇక తాజాగా మళ్లీ సమంత, వరలక్ష్మి ఇద్దరూ ఓ పార్టీకి అటెండ్ అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సమంత తమ ఫొటోలను షేర్ చేసింది.
అయితే సమంత, వరలక్ష్మి శరత్ కుమార్ ఇద్దరూ తరచూ ఒకే చోట కనిపిస్తుండడంతో సమంతకు కొత్త ఫ్రెండ్ దొరికిందని అంటున్నారు. వీరిద్దరూ మంచి స్నేహితుల్లా మారిపోయారని వారి ఫొటోలను చూస్తే అర్థమవుతుందని అంటున్నారు.
ఇక ఈ మధ్య సమంత వెకేషన్స్‌కు వెళ్లినప్పుడు తన స్నేహితురాలు, మోడల్ శిల్పారెడ్డిని తీసుకెళ్లింది. గతంలో వీరు చార్‌ధామ్‌కు కూడా వెళ్లారు. అయితే ప్రస్తుతం సినిమా షూటింగ్‌లో ఉంది కనుక సమంత.. వరలక్ష్మితో స్నేహంగా ఉంటుందని తెలుస్తోంది. మరి కొత్త ఫ్రెండ్ షిప్ ఎంత కాలం ఉంటుందో చూడాలని ఫ్యాన్స్ అంటున్నారు.