Health Tips : రోజూ మనం తినే ఆహారాలు, తాగే ద్రవాల కారణంగా మన శరీరంలో ఎప్పటికప్పుడు వ్యర్థాలు పేరుకుపోతుంటాయి. అలాగే మనం వ్యాయామం చేయకపోయినా, తగినంత నీటిని తాగకపోయినా.. శరీరంలో వ్యర్థాలు, విష పదార్థాలు అలాగే ఉండిపోతుంటాయి. దీంతో మనకు పలు అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఈ క్రమంలోనే మన శరీరంలో రోజూ పేరుకుపోయే వ్యర్థాలను బయటకు పంపాల్సి ఉంటుంది. లేకపోతే మన శరీరంలో అవి పేరుకుపోతే మన శరీరం మనకు పలు లక్షణాలను తెలియజేస్తుంది. దీంతో మనం మన శరరీంలో వ్యర్థాలు నిండిపోయాయని అర్థం చేసుకోవాలి. అప్పుడు వ్యర్థాలను బయటకు పంపే ప్రయత్నం చేయాలి. ఇక శరీరంలో వ్యర్థాలు నిండిపోతే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. శరీరంలో తీవ్రంగా వ్యర్థాలు నిండిపోతే మనకు తీవ్రమైన అలసట వస్తుంటుంది. చిన్న పనిచేసినా బాగా అలసిపోయినట్లు, అసలు శక్తి లేనట్లు ఫీలవుతారు. శరీరంలో వ్యర్థాలు బాగా ఉన్నాయనేందుకు ఇది ఒక లక్షణం. కనుక ఈ లక్షణం కనిపిస్తే జాగ్రత్త పడాలి.
2. శరరీంలో వ్యర్థాలు బాగా పేరుకుపోతే చర్మం డల్‌గా మారుతుంది. చర్మంపై దద్దుర్లు, దురదలు, ఎర్రని మచ్చలు వస్తాయి.
3. కళ్ల కింద బాగా వాపులు వస్తుంటే శరీరంలో వ్యర్థాలు బాగా ఉన్నాయని అర్థం. దీంతో శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే ప్రయత్నం చేయాలి. దీని వల్ల వాపులు తగ్గిపోతాయి.
4. శరీరంలో వ్యర్థాలు బాగా ఉంటే జుట్టు విపరీతంగా రాలిపోతుంది. అలర్జీలు వస్తుంటాయి.
5. శరరీంలో వ్యర్థాలు ఎక్కువగా ఉంటే జీర్ణ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఎల్లప్పుడూ గ్యాస్ వస్తుంది. మలబద్దకం ఉంటుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ఱం కాదు. ఏమీ తినాలనిపించదు. ఆకలి ఉండదు.
6. కంగారు, ఆందోళన, మతిమరుపు సడెన్‌గా వచ్చాయంటే.. అందుకు కారణం శరరీంలో వ్యర్థాలు పేరుకుపోవడమే అని చెప్పవచ్చు.
ఇక ఈ లక్షణాలు కనిపించే వారు ఏమాత్రం అశ్రద్ధ చేయరాదు. వెంటనే శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఉదయాన్నే పరగడుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి తాగాలి. ఇది అద్భుతమైన డిటాక్స్ డ్రింక్‌లా పనిచేస్తుంది. దీన్ని తాగలేని వారు పరగడుపునే కొత్తిమీర జ్యూస్ లేదా కీరదోస జ్యూస్ లేదా బీట్‌రూట్ జ్యూస్‌లను తాగవచ్చు. ఇవి కూడా శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. శరీరాన్ని అంతర్గతంగా శుభ్రం చేస్తాయి. దీంతో పైన తెలిపిన లక్షణాలు మాయమవుతాయి. ఫలితంగా ఆరోగ్యంగా ఉండవచ్చు. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అయితే ఆయా జ్యూస్‌లలో నిమ్మరసం కలిపి తాగాలి. దీంతో మరింత ఎక్కువ ఫలితం లభిస్తుంది.