మీ ఇంటి దగ్గరలో కనీసం 1000 గజాల స్థలం ఎక్కడైనా ఉంటే చూడండి. మూడు వైపులా ఖాళీ ఉండే కార్నర్ బిట్ అయితే చాలా మంచిది. ఒక సివిల్ కాంట్రాక్టర్ తో మాట్లాడి నేల చదును చేసి చుట్టూ ప్రహరీ గోడ వేయండి. ఇపుడు మూడు వైపులా ఖాళీ ఉండే ప్రదేశం వదిలేసి నాలగవ వైపు మాత్రం ఒక వంద మంది కూర్చునే గాలరీ పని మొదలు పెట్టండి. చదును చేసిన ప్రదేశం లో ఒక స్కేటింగ్ రింక్ బిల్డ్ చేయండి. కనీసం వంద మంది ఇపుడు అక్కడ స్కేటింగ్ నేర్చుకోవచ్చు. నెలవారి అద్దె 30 – 40 వేలు మాత్రమే ఉండి మూడు నెలల అడ్వాన్స్ తో ప్లేస్ బ్లాక్ చేసుకోండి. ట్రైనర్ కి 40,000 జీతం, ఇద్దరు అసిస్టెంట్స్ 15,000 చొప్పున 30 వేలు ఖర్చు ప్రతి నెలా ఉంటుంది.
ప్రహరీ చుట్టూ సిసిటీవి, వాష్ రూమ్, ఒక ఆఫీస్ రూమ్, పార్కింగ్ ప్లేస్ ఉండేలా జాగ్రత్త తీసుకోండి. ఇపుడు నెలకు ఒక విద్యార్ధికి 3000 రూపాయల చొప్పున పొద్దున్న 200 మంది, సాయంత్రం 100 మంది వచ్చేలా మీ ప్రదేశం నుండి 5 కిలో మీటర్ల వరకు ప్రమోట్ చేయండి. నిర్మాణానికి 5 లక్షలలోపే ఐపోయేలా చూసుకోండి, మరొక రెండు లక్షలు ప్రమోషన్స్ కోసం సిద్దం చేసుకోండి. మూడు లక్షలు బాక్ అప్ ప్లాన్ ఉంచుకోండి. నెలవారి అద్దె జీతాలు కలుపుకుని 1,20,000 వరకు అవుతుంది. నెలకు వందమని వచ్చినా మూడు లక్షలు ఆదాయం వస్తుంది. అక్కడితో ఆగిపోకుండా కనీసం 300 మంది వచ్చేలా పక్కగా సిద్దం చేసుకోండి.
పొద్దున్న 4 – 9 వరకు, సాయంత్రం 4 – 9 వరకు సుమారుగా 500 మందికి ప్రతినెలా ట్రైనింగ్ ఇవ్వవవచ్చును. లాంగ్ లీజ్ ఐదేళ్ళకి రాసుకుని, స్కేటింగ్ అకాడమీ సిద్దం చేసుకుంటే ఈ రోజుల్లో ఏ నగరంలో అయినా ఈ ప్లాన్ వర్క్ అవుట్ అవుతుంది. చాట్ జీపీటీ, కిరాణా సామాన్లు పెట్టమని చెప్పేవారి ఆలోచనలు మానేసి కొత్తగా లాభదాయకంగా ఆలోచించండి.