Navagraha Doshalu : మనలో ప్రతి ఒక్కరు నిత్యం ఏదో ఒక సమస్యతో సతమతమవుతూ ఉంటారు. ఉద్యోగాలు రాకపోవడం లేదా ఉద్యోగంలో ఎదుగుదల లేకపోవడం, సంతానం లేకపోవడం, ఎంత సంపాదించినా ఖర్చు తప్ప ఆదాయం లేకపోవడం వంటి సమస్యలతో ఇబ్బంది పడతారు. అయితే కొందరు వ్యక్తులు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా తమ సమస్యల నుండి బయటపడలేరు. అలాంటి వారంతా నవగ్రహ దోషాలతో బాధపడతున్నట్టేనని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
నవగ్రహ దోష నివారణ అనేది చాలామందికి ఖర్చుతో కూడుకున్న పని. నవగ్రహ జపాలు,శాంతి, హోమాలు, దానాలు చేయటం సాధ్యం కాదు. మరి ఎలా ఈ సమస్య పరిష్కారం అవుతుంది అనేది లక్షలాదిమంది ఉన్న అనుమానం. అయితే పలు పురాణాల్లో, శాస్ర్తాల్లో, అనుభవజ్ఞుల జీవితంలో ఆచరించిన పలు చిన్నచిన్న క్రియలు అనేవి ఆచరిస్తే చాలు నవగ్రహదోషాలను తొలగిస్తాయి. ఆ క్రమంలో భాగంగా.. ఈ రోజు నవగ్రహ దోషం పోవాలంటే అత్యంత సులభమైన ఉపాయం మరియు ఆచరణ సాధ్యమైయ్యే ఒక విధానాన్ని నేడు తెలుసుకుందాం.
జన్మించిన సమయాన్ని బట్టి మన జాతకంలో ఆయా గ్రహాలు ఉన్న స్థానాన్ని బట్టి మంచి, చెడు ఫలితాలు నిర్ణయించబడతాయి. ఎటువంటి దోషాలకైనా పలు శాస్ర్తాల్లో చెప్పిన విధంగా సులభమైన పరిష్కారాలు కచ్చితంగా ఉంటాయి. గోవు అంటే దేశవాలి ఆవు ద్వారా మన నవగ్రహదోషాలను తొలిగించుకోవచ్చు. గోవులోని అంగాలలో సమస్త దేవతలు కొలువై ఉంటారు. సప్తఋషులు, నదులు, తీర్థములు గోవులో ఉంటాయి. గోపాదలో ధర్మార్థకామమోక్షములు ఉంటాయి. ఆవుకాళ్లను కడిగి ఆ నీటిని నెత్తిమీద చల్లుకుంటే సర్వ పాపాలు నశిస్తాయి.
అంతేకాకుండా గోవులు సాయంత్రం ఇంటికి వచ్చే సమయాన్ని గోధూళి వేళ అంటారు. ఆ సమయంలో ఎవరైతే గోధూళిలో నిలబడతారో వారికి నవగ్రహదోషాలు తొలిగిపోతాయి. భక్తితో ఇష్టదేవతా నామస్మరణతో గోధూళిలో నిలబడాలి. ఇలాకొన్ని రోజులుపాటు చేస్తే తప్పకుండా నవగ్రహదోషాలు పోతాయి. అదేవిధంగా గోవుకు నవధాన్యాలు, ఆకుకూరలు, పండ్లు మొదలైనవి తినిపిస్తే సకల శుభాలు కలుగుతాయి. గోపూజకు భక్తి అనేది ప్రధానం. అంతేకానీ మడి ప్రధానం కాదు. సూక్ష్మంలో మోక్షం పొందాలంటే గోపూజ, గోదానం, గోసేవ చేసుకోండి. తప్పక విశేష ఫలితాలు కలుగుతాయి. గోధూళివేళ స్వదేశీ గోవులు ఉన్నచోట నిలబడండి. వీలైతే గోవులు నడిచిపోయిన వెంటనే ఆ మట్టిని కొంత సేకరించి మీ ఇంట్లో పెట్టుకుని ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత పొడి భస్మంగా నుదిటిన కొంచెం పెట్టుకోండి. ఇలా చేయటం వలన మీ నవగ్రహదోషాలన్ని తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి.