శుక్రవారం అంటే.. అమ్మవారికి ఎంతో ప్రీతికరం. అందులోనూ లక్ష్మీదేవికి ప్రతిరూపం శుక్రవారం. కాబట్టి ఇంట్లో అమ్మవారికి రకరకాల పూలతో అలంకరించి, నైవేద్యం సమర్పించి పూజలు చేయడం వల్ల ఆ తల్లి ఆశీస్సు పొందవచ్చు. అలాగే శుక్రవారం మహిళలు ఎరుపు లేదా ఆకుపచ్చ వంటి రంగుల దుస్తులు ధరించి, కాళ్లూ, చేతులు, ముఖానికి పసుపు రాసుకుని లక్ష్మీదేవిని పూజిస్తే.. ఆ తల్లి కరుణా కటాక్షాలు ఉంటాయి. అలాగే ఆ ఇంటి సిరిసంపదలు, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ప్రతి ఇంట్లోనూ సిరిసంపదలు లక్ష్మీకటాక్షంతోనే పొందగలుగుతాం. ఆ తల్లి అనుగ్రహం ఉన్నంతవరకు ఇంట్లో లేమి అన్న సమస్య ఉండదు. కొంతమంది ఇబ్బందులు, సమస్యలు, డబ్బులు నిలబడకపోవడం, ఖర్చులు, అప్పుల బాధలు, రకరకాల సంపద సమస్యలు ఎదుర్కొటు ఉంటారు. కాబట్టి ఆ అమ్మవారి అనుగ్రహం పొందడానికి లక్ష్మీదేవిని ధ్యానిస్తూ ఉండాలి.
అంతేకాదు మీ రాశిని బట్టి లక్ష్మీదేవిని పూజించే మంత్రాలు ఉన్నాయి. మహా లక్ష్మిని మీ ఇంటికి ఆహ్వానించడానికి ఏ రాశి వాళ్లు ఏ మంత్రం జపించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. మేషరాశి వాళ్లు మహా లక్ష్మి కరుణా కటాక్షాలు పొందడానికి ఓం క్లీం సో అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. కేవలం శుక్రవారమే కాకుండా.. ఎప్పుడు వీలైతే అప్పుడు జపించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. లక్ష్మీ దేవి అనుగ్రహం పొందడానికి వృషభ రాశి వాళ్లు ఓం ఏం క్లీం శ్రీం అనే మంత్రాన్ని జపించాలి. తమ ఇంటి సిరి సంపదలు కురవాలంటే.. మిథునరాశి వాళ్లు జపించాల్సిన మంత్రం ఓం క్లీం ఏం సో. కర్కాటక రాశి వాళ్లు లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే ఓం ఏం క్లీం శ్రీ అని భక్తితో మంత్ర జంపం చేయాలి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే.. సింహరాశి వాళ్లు ఓం హ్రీం ఏం సో అనే మంత్రాన్ని మనసులో ధ్యానించాలి.
కన్యా రాశి వాళ్లు మహా లక్ష్మీ కటాక్షం పొందడానికి.. ఆ తల్లిని పూజించేటప్పుడు ఓం శ్రీం ఏం సో అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ఎప్పుడు వీలైతే అప్పుడు లక్ష్మీ నామస్మరణ చేయడం వల్ల ఆ తల్లి కరుణా కటాక్షాలు పొందవచ్చు. తులారాశి వాళ్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఓం హ్రీం క్లీం శ్రీం అనే మంత్రాన్ని ధ్యానిస్తూ ఉండాలి. లక్ష్మీ దేవి అనుగ్రహం ఉన్నప్పుడు ఇంట్లో సకల సంపదలు, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి ఆ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి వృశ్చికరాశి వాళ్లు ఓం ఏం క్లీం సో అనే మంత్రం జపించాలి. ధనుస్సు రాశి లక్ష్మీ దేవి అనుగ్రహ సిద్ధి పొందాలంటే.. ఓం హ్రీం క్లీం సో అనే మంత్రం ధ్యానించాలి. మకర రాశి రాశిని బట్టి లక్ష్మీ మంత్రం జంపిచడం వల్ల ఆ తల్లి కరుణా కటాక్షాలు సిద్ధిస్తాయి. కాబట్టి మీది మకరరాశి అయితే.. మీరు ఓం ఏం క్లీం హ్రీం శ్రీం సో అనే మంత్రం జపించాలి. కుంభరాశి వాళ్లు లక్షీ దేవి అనుగ్రహం పొందడానికి ఓం హ్రీం ఏం క్లీం శ్రీం అనే మంత్రాన్ని ధ్యానించాలి. మనసు ప్రశాంతంగా, దైవంపై ఏకాగ్రత పెట్టి మీనరాశి వాళ్లు ఆ మహాలక్ష్మీని ధ్యానించాలి. ఆ సమయంలో ఓం హ్రీం క్లీం సో అనే మంత్రాన్ని జపించడం వల్ల అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు.