Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

ల‌లితా స‌హ‌స్ర నామాల వెనుక ఉన్న ర‌హ‌స్యం తెలుసా..?

Admin by Admin
March 25, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అని ఆ శ్రీశక్తికి పేరు. ఆ అమ్మను ఏ పేరున పిలిచినా పరవశించిపోతుంది. బిడ్డను ఆదుకుంటుంది. కోరిన కోరికలను తీరుస్తుంది ఆ పెద్దమ్మ. ఎరుపు రంగు దుస్తులు కట్టుకొన్న, ప్రేమమయ చూపులు కలిగిన పాశము, అంకుశం, పుష్పం చెరకు గడను నాలుగు చేతులలో ధరించిన అణిమాది సిద్ధులను కలిగిన శివుడి భార్య అయిన భవానియే లలిత. రావణుని చంపాలంటే ఆదిత్య హృదయం పారాయణం చేస్తేనే సాధ్యం. ఆ మహామంత్రాన్ని శ్రీరాముడికి చెప్పిన వారు అగస్త్య మహాముని. అటువంటి అగస్త్య మహాముని ఆత్మతత్వమును తెలుసుకోవాలనుకుంటాడు. ఆ విషయం ఎంత త్వరగా తెలుసుకుంటే జీవుడు అంత త్వరగా పరమాత్మను చేరుకుంటాడు. జనన మరణ ఝంజాటం నుండి తప్పించుకోగలుగుతాడు. అందుకుగాను అగస్త్య మహాముని శ్రీలలితను స్మరించేందుకు నామతారకమును అనుగ్రహించవలసినదిగా హయగ్రీవుడు అనే మహామునిని కోరుతాడు.

ఏ పేరిట పిలిస్తే, ఆ తల్లి పలుకు తుందో ఆ పేర్లన్నీ హయగ్రీవుని అశ్వకంఠముతో ఆశువగా వస్తాయి. ఈనామ సహస్రమే లలితా సహస్రం. ఇవి వేయినామాలు. ఇందులో కామాక్షి,పార్వతి, దుర్గ, మహాకాళి, సరస్వతి, భవాని, నారాయణి, కల్యాణి, రాజరాజేశ్వరి మహాత్రిపురసుందరి, వైష్ణవి, మహేశ్వరి, చండికా, విశాలాక్షి, గాయిత్రి అనేక దేవి రూపాలు కనపడతాయి. శ్రీలలితా సహస్రనామములు కేవలం స్తోత్రం కాదు. ఇది గొప్ప శాస్త్రము. గొప్ప ప్రమాణం. ఈ వేయినామాలు 183 శ్లోకములలో చెప్పబడినవి. శ్రీమాతా అను నామముతో మొదలై లలితాంబికా అనునామముతో పూర్తవుతుంది. విడివిడిగా చదువుతే ఓం శ్రీమాత్రేనమః అని చదవాలి. అర్థము తెలుసుకునే చదవాలి. అలా వీలుకానప్పుడు నామజపము వలె చదవాలి. ఎలా చదివినా భక్తితో చదివితే పుణ్యం వస్తుంది. శ్రీమాత ఈ నామముతో మొదలవుతుంది. ఈ నామమము వివరణ ఇవ్వబడుతున్నది. శ్రీమాతా శ్రీదేవి మాతృమూర్తి అయి సృష్టికి కారకురాలైనది. తల్లి, తండ్రి, గురువు రూపములో వున్నది. శ్రీఅంటే లక్ష్మి. మా అమ్మ లక్ష్మీయే. మాతృసహజమైన మమకారం అందిస్తుంది. ప్రేమతో కూడిన కాఠిన్యం ప్రదర్శిస్తూ సమస్తప్రాణి కోటిని సరిదిద్దుతుంది. ప్రతినామము ఒక మంత్రం.

lalitha devi importance

ఈ నామములు చదివితే వచ్చే ఫలితం క్లుప్తంగా తెలుసుకొందాం. జీవితం తరిస్తుంది. అపమృత్యువు పోతుంది. ఆయుష్షు పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. సర్వపాపాలు తొలగిపోతాయి. ఇంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు. అందుకే శ్రీలలితా సహస్రనామాలు భక్తితో, శుచితో, యమానుసారం చదివినా, పారాయణం చేసినా, శ్రవణం చేసినా అఖండ ఫలితం వస్తుంది. అయితే లలితా సహస్రనామ పారాయణం చేసేటప్పుడు కొన్ని నిబంధనలు తప్పక పాటించాలి. దీనిలో ఏకాక్షరి, ద్వి ఇలా… పదహారు అక్షరాల వరకు ఉన్న నామాలు ఉన్నాయి. వాటి ఉచ్ఛరణ తప్పులు లేకుండా పలకాలి. లేకుంటే దోషాలు కలుగుతాయి.

Tags: Lalitha Devi
Previous Post

చైల్డ్ ఆర్టిస్ట్ గా భారీ రెమ్యూనరేషన్ అందుకున్న షామిలి.. చేతులారా జీవితాన్ని నాశనం చేసుకుందా?

Next Post

శ్రీ మ‌హావిష్ణువు మ‌త్స్యావ‌తారం ఎందుకు ధ‌రించాడో తెలుసా..?

Related Posts

పోష‌ణ‌

ఈ విత్త‌నాలు ఏంటో తెలుసా..? వీటిని ప‌డేయ‌కుండా కచ్చితంగా తినాల్సిందే..!

June 14, 2025
హెల్త్ టిప్స్

బొప్పాయిని ఉద‌యం తింటే ఏం జ‌రుగుతుందంటే..?

June 14, 2025
హెల్త్ టిప్స్

స‌న్న‌గా ఉన్న‌వారు బ‌రువు పెర‌గాలి అనుకుంటున్నారా.. అయితే వీటిని తినండి..!

June 14, 2025
ఆధ్యాత్మికం

ప‌ర‌మేశ్వ‌రుడు పులి చ‌ర్మాన్ని ఎందుకు ధ‌రిస్తాడు.. దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

June 14, 2025
ఆధ్యాత్మికం

ల‌వంగాలు, క‌ర్పూరంతో ఇలా చేస్తే మీకుండే స‌మ‌స్య‌లు అన్నీ పోతాయి..!

June 14, 2025
vastu

వాస్తు ప్ర‌కారం ఇంట్లో రామ చిలుక‌ల‌ను పెంచుకోవ‌చ్చా..? పెంచితే ఏమ‌వుతుంది..?

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!